విషబీజాలు

విషబీజాలు

లాలియనుచు జోలపాడ నిద్ర పోవు చిన్నారులు!
చందురుణ్ణి పిలువగనే మురిసిపోవు చిన్నారులు!
తల్లిపాలు త్రాగుచూనె రొమ్ముతోన ఆడేరుగ!
తల్లితనము పూర్తిగాను మరచిపోవు చిన్నారులు!

ఎదురుతిరిగి చరించుచూ ఆడేరుగ స్ర్తీలతోను!
మృగాళ్ళుగా మారిపోయి కూడేరుగ స్ర్తీలతోను!
ఆడదనగ మాతృసమము తెలుసుకోవు ఏనాడూ
విషబీజము మదినింపుకు తిరిగేరుగ స్ర్తీలతోను!

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts