విష్ణుశర్మ కధలు
పంచతంత్రాన్ని రచించింది విష్ణుశర్మ అనే పండితుడు.పంచతంత్ర కధలను ఆయన సంస్కృతంలో వ్రాసారు.
పూర్వం విష్ణుశర్మ తన వద్ద విద్య నేర్చుకోదలచిన శిష్యుల కోసం ఈ కధలను వ్రాసాడు. ఈ పుస్తకంలో ఐదు భాగాలు ఉన్నాయి. మిత్రలాభం, మిత్ర భేదం ..ఇలా ఐదు భాగాలు ఉన్నాయి.
ఈ కధలలో జంతువులే ఎక్కువగా ఉన్నాయి. విష్ణు శర్మ ఈ కధలు రాయటానికి ముఖ్య కారణంఏమిటంటే అమరశక్తి అనే రాజుకు బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు ఉన్నారు.
ఆ ముగ్గురు చదువుసంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. రాజకుమారులకు విద్యనేర్చుకోవాలని లేదీ. అమరశక్తి రాజు తన బాధను మంత్రులతో పంచుకుని వారిని పరిష్కారం చెప్పమన్నాడు.
అప్పుడు వారు విష్ణుశర్మ అనే పండితుడు రాకుమారులకు అన్ని నీతి శాస్త్రంలోని అన్ని విషయాలు నేర్పించగలరు.
రాజకుమారులను విష్ణు శర్మకు అప్పగించండని రాజుకు సలహా ఇచ్చాడు. వెంటనే
రాజు విష్ణుశర్మను పిలిపించాడు.
రాకుమారుల చదువు విషయమై ఆయనతో మాట్లాడాడు. తన పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించమని విష్ణుశర్మని కోరాడు. రాజు కుమారులను నీతిశాస్త్రం బోధిస్తానని విష్ణుశర్మ
వాగ్దానం చేసి రాకుమారులను అరణ్యంలోని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడే ఆయన పంచతంత్ర పుస్తకాన్ని రచించాడు.
ఆ పుస్తకంలోని కథలను రాజకుమారులకు చెప్పి వారికి నీతిశాస్త్రం నేర్పించి రాజునకు ఇచ్చిన మాటను నిలబెట్టకున్నాడు.
ఈ కధలు ప్రపంచంలోని అన్ని భాషలలో అనువదించబడ్డాయి.
-వెంకట భానుప్రసాద్