విశ్రాంతి ఎప్పుడు?

విశ్రాంతి ఎప్పుడు?

పొద్దున్నే లేస్తావు
బొంగరం లా తిరుగుతావు
నిరంతర యంత్రంలా
పనిచేస్తావు
నీవొక మనిషన్న సంగతి మరుస్తావు 
మాటలెన్నో మాట్లాడుతూ
మంచికి ప్రయత్నిస్తావు

మగువా మగువా
నీకెక్కడిదే మనుగడ
లేని జీవితం గడుపుతావు
మాటలెన్నో పడతావు
అవమానిస్తాడు.
అనుమానిస్తాడు
అయినా నీ పెదవి పై
చిరునవ్వు కదలనీవు
మగువా మగువా
మానసిక ఒత్తిడిని
తట్టుకుంటూ ఎంతో
శ్రమ కొరుస్తావు 
అందరి ఆరోగ్యం చూస్తూ
నీ ఆరోగ్యం చూసుకోవూ
నవమాసాలు మోసి
నరకం చూస్తూ ఆనందాన్ని
పొందుతావు
మగువా మగువా నీ
మనుగడ కోసం
ఎప్పుడు అలోచిస్తావు

నీకు నువ్వు విశ్రాంతి
ఎప్పుడు తీసుకుంటావు?

– భవ్యచారు

Related Posts