విత్తు .కాం

విత్తు .కాం

విత్తు. కామ్ ( నాకు ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారో తెలియదు అండి… నిజ్జంగా నిజం అండి .. నమ్మండి. )

రెయ్ సిద్దు ఏంట్రా ఇక్కడ ఒక్కడివి కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ వచ్చాడు రామ్. ఆ దారా కూర్చుని చెక్క భజన చేస్తున్నా నువ్వు కూడా వస్తె ఇద్దరం కలిసి చేసుకుందాం అన్నాడు సిద్దు. ఏంటి ఇంత వేడి గా ఉన్నావ్ , ఏం జరిగింది ఏమిటి అన్నాడు రామ్ విలాసంగా బైక్ కీ తిప్పుతూ , అది చూస్తూ ఇంకా వెర్రెక్కి న సిద్దు హా బొక్క పడింది రా నా జాబ్ దొబ్బింధి అన్నాడు సిద్దు.

అరే అవునా ఎలా రా అన్నాడు రామ్ , హా ఎవడో కూలి కాంట్రాక్టర్ మీదికి అరిచాడు అంట అందుకే వాడిని నేనే తెచ్చి ఇచ్చిన పాపానికి నా మీద కే అనిపిస్తావా అంటూ వాడిని నన్ను కలిపి ఉద్యోగం నుంచి పీకేశాడు సచ్చినోడు అన్నాడు సిద్దు.

సరేలే మామ పోతే పోయింది ఇంకో జాబు చూసుకోవచ్చు లే అన్నాడు రామ్ . ఆహా అవునా అంగట్లో పెద్ద తేర గా దొరికేస్తున్నాయని ఇలా వెళ్లి అలా తెచ్చుకోవచ్చు నీకేంటి నువ్వు ఏమైనా చెప్తావ్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి వి తర తరాలకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి కి దగ్గర ఏమైనా చెప్తావ్ మాకే వచ్చింది బొక్క అక్కసు గా ఆన్నాడు సిద్ధూ ..

ఏంట్రా ఆటో ఇట్ పోయి నా మీద పడ్డావు నన్ను వదిలేయ్ నువ్వేమైనా ఏడు నాకు సినిమాకు టైం అవుతుంది వెళ్లాలి అంటూ బైక్ చైన్ తిప్పుతూ విలాసంగా వెళ్లిపోయాడు రామ్.

తనకు ఆ శక్తి ఉందన్న అహంకారం గర్వం అతనిలో ఉన్నాయి జీవితం మీద ఏ మాత్రం అవగాహన లేని వేడికి నా జాబ్ పోయిందన్న బాధ ఏం తెలుస్తుంది. ఈ సమయంలో ఉన్న ఉద్యోగం పోవడం అంటే ఎంత కష్టమో వాడికేం తెలుసు.

పోయి పోయి వీడియో చెప్పుకున్నాను చూడు అది కూడా నా తప్పే , ఈ కరుణా సమయంలో ఈ జాబ్ కూడా దొరకని వాళ్ళు ఎందరో ఇలాంటి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు ఉన్న జాబ్ కూడా పోయింది అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ తన పట్టుకున్నాడు సిద్దు.

అసలు తను తప్పేం చేయలేదు. కాంట్రాక్టర్లు తక్కువ ధరకి వ్యవసాయ కూలీలను తీసుకురమ్మని చెప్పడం వల్లే తాను వాళ్ళకి కనీసం రెండు వందలు ఎక్కువ వస్తాయని వాళ్లకు పనులు ఉన్నా , నచ్చ చెప్పి ఎలాగో తెచ్చాడు. కానీ కాంట్రాక్టర్ మాత్రం నాలుగు రోజుల పని రెండు రోజుల లో చేయమంటే వాళ్ళు మాత్రం ఎలా చేస్తారు.

వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు ఎంత కష్టం అయినా చేస్తారు. కానీ అలవాటు లేని పని కాబట్టి కాస్త కష్టంగా అనిపించింది. కూలీ పెంచమని అన్నందుకు కాంట్రాక్టర్ తనని అడిగిన వాడిని ఇద్దర్నీ పొమ్మన్నాడు.ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. అసలే ఉద్యోగాలు దొరకక చాలా మంది నిరుద్యోగులు అయ్యారు. ఇప్పుడు ఎవర్నీ పలకరించినా ఇదే గోల అనుకుంటూ ఆలోచిస్తున్న సమయంలో ఎన్ని సార్లు పిలిచినా పలకవ్ ఏంట్రా సిద్దు అంటూ వచ్చాడు పక్కింటి ప్రవీణ్ ,.

ప్రవీణ్ కి పదో తరగతి లోనే పెద్దవాళ్ళు పెళ్లి చేశారు.దాంతో అతన్ని అన్న అని పిలవడం సిద్దుకి అలవాటు అయ్యింది. ప్రవీణ్ సిద్దు కంటే ఒక్క యాడాధి పెద్ద అంతే , ప్రవీణ్ ఇప్పుడు పక్కుర్లో ఏదో హాస్పిటల్ లో పని చేస్తున్నాడని తెలుసు కానీ ఏం పని అని ఎప్పుడు అడగలేదు సిద్దు.

ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన సిద్దు ఏం లా అన్న ఉన్న ఉద్యోగం ఊడింది. ఎలా అని ఆలోచిస్తున్న అన్నాడు సిద్దు. అయ్యో అవునా రా రోజు ఈ పాటికి ఇంట్లో నే ఫోన్ చూస్తూ పడుకునే నువ్వు ఇంకా ఇంటికి రాలేదని మీ అవ్వ కంగారు పడుతుంటే నిన్ను వెతుకుతూ నేను వచ్చాను అన్నాడు ప్రవీణ్ .

అయ్యో అవునా అవ్వ కు ఏం చెప్పాలో ఇప్పుడు అర్థం కావడం లేదు అన్న చిన్నప్పటి నుండి నన్ను పెంచి పోషించిన అవ్వను ఈ వయసులో కూడా చూసుకొని బతుకు ఎందుకన్నా నాకు అంటూ బాధ పడసాగాడు సిద్దు కళ్ళలో నుండి కారుతున్నా నీటిని తుడుచుకుంటూ, బాధ పడకు సిద్దు ఏదో ఒకటి చూద్దాం లే అంటూ ఓదార్చాడు ప్రవీణ్.

అది కాదన్నా చిన్నప్పుడే అమ్మా నాన్న వ్యవసాయ పొలం లో కరెంటు షాక్ తగిలి చనిపోతే నన్ను అవ్వ చాలా కష్టపడి పెంచింది. పిన్ని , బాబాయి కూడా తమ కొడుక్కు కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇంత చదివినా కూడా గవర్నమెంటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కూడా ఏదో ఒకటి చేసి వారి రుణం కొంచమైనా తీర్చుకోవాలి అని ఇక్కడ అభిమానం కూడా వదిలేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర పనికి వెళ్ళినా వాడు కూడా వాడి అధికారం చూపించాడు. ఇక్కడి వాళ్ళు ఎక్కువ కూలి అడుగుతున్నారు అని బీహార్ వాళ్లను తీసుకుని వచ్చారు. వాళ్ళు చచ్చినట్టు తీసుకున్న డబ్బుకు రెండింతలు పని చేస్తారు. మరి ఈ మాత్రం కూడా అక్కడ దొరకడం లేదంటే వాళ్ళ ఆకలి బాధ అర్ధమైన రైతు కూలీలు వాళ్లను బతక మని చెప్పి తాము ఉన్న ఊర్లో నే పని నీ చూసుకున్నారు.

ఇంకెక్కడ చూడాలన్నా నేను కూలి పనులకు వెళ్ళాలన్నా అవి కూడా దొరకడం లేదు . అతి కష్టం మిద పిన్ని బాబాయి కి దొరికినా అవి తిండికే సరిపోతుంది. అవ్వకు మంచి బలమైన ఆహారం పెట్టాలన్న నా కోరిక అలాగే మిగిలి పోతుంది. అంటూ బాధ పడుతున్న సిద్దూతో

ప్రవీణ్ అరేయ్ నువ్వు రోజు ఫోన్ చూస్తావు కదా మీ దోస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగొచ్చు కదా అన్నాడు ప్రవీణ్. ఆ మాటలతో ఎక్కడి దోస్తులు అన్నా, జాబ్ ఉందన్న గర్వం తో అందర్నీ వదిలేసి ఏవేవో చూసాను ఫోన్ లో కానీ ఏ రోజు వాళ్లను పలకరించిన పాపాన పోలేదు. ఇప్పుడేం మొఖం పెట్టుకుని అడగాలి అన్నాడు సిద్దు.

అవునా మరి రోజు ఫోన్ పట్టుకుని గంటలు గంటలు అంతగా నువు చూసేది ఏంటి రా అంటూ అడిగాడు ఆసక్తి గా ప్రవీణ్.

ఏ ఏముంటాయి అన్నా గవే పొరల్లం చూసేవి , నువ్వు పెళ్లి చేసుకుని చేస్తున్నావు, మేము అవే ఇందులో చూస్తూ కార్చు కుంటున్నాం అన్నాడు. అంటే ఏంట్రా అన్నాడు ప్రవీణ్ . అదే రా హ్యాండ్ పంపు ( అలాగే అంటారా ఏమో ) అంటూ చేయి చూపించాడు సిద్దు.

వెంటనే ప్రవీణ్ మొహం సిగ్గుతో ఎర్రగా అయిపోయింది. ఆ వెంటనే అతని మొఖ కవళికలు అన్ని మారిపోయి, సిద్దు తో రెయ్ సిద్దు ఒక ఆలోచన వచ్చింది రా , డబ్బు కోసం నువ్వు ఏం బాధ పడకు రేప్ నీకు ఒక మంచి ఉద్యోగం నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తుంది.

పద అవ్వ నీ కోసం ఎదురు చూస్తుంది. హాయిగా తిని నిదురపో అంటూ బలవంతంగా తీసుకుని ఇంటికి వెళ్ళిన ప్రవీణ్ అవ్వ కు సిద్ధుని అప్పగిస్తూ అవ్వ ఇదిగో నీ సిద్దు వాడికి ఇంత ముద్ద పెట్టీ పడుకో బెట్టూ అన్నాడు ప్రవీణ్..

ఏదో జరిగిందని అర్దం చేసుకున్న అవ్వ ఏం మాట్లాడకుండా సిద్దు తో రా అయ్యా సిద్దయ్య నీ కోసం కోడిగుడ్డు కూర చేశాను అందుకే ఏడ ఉన్నవో చూసి రమ్మని పంపిన అంతే అంది సిద్దు తో..

అవ్వ ప్రేమ తెలిసిన సిద్దు అవునా అవ్వ సరే ఇప్పుడే వస్తున్న అంటూ బాత్రూం లోకి వెళ్ళాడు. అవ్వను బాధ పెట్టకూడదు అనుకుంటూ..

ఏమయ్యింది అంటూ సైగ చెసింది అవ్వ. ప్రవీణ్ మెల్లిగా ఉద్యోగం పోయింది అంటూ చెప్పాడు. అవాక్కయిన అవ్వతో ప్రవీణ్ మరేం కంగరుంపడకు వేరేది చూశాను . డబ్బులు బాగానే వస్తాయి. రేపు తీసుకుని వెళ్తా లే అన్నాడు అవ్వ తో. అవ్వ సరే అన్నట్టు సైగ చేసి లోపలికి వెళ్ళిపోయింది. ప్రవీణ్ కూడా తన ఇంట్లోకి వెళ్ళాడు…

***

రెయ్ సిద్దు లేవరా మనం ఒక చోటుకు వెళ్లాలి లేరా అంటూ లేపుతున్న ప్రవీణ్ ను చూస్తూ ఏంటన్న ఏడికి అంటూ అడిగాడు సిద్దు. నువ్వు ముందు రెఢీ అయ్యి రా మా ఇంటి దగ్గర ఉంటా అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళాడు ప్రవీణ్.

ఏంటో ఈ అన్న గోల , అయినా ఏదైనా పని చూశాడు ఏమో అదైంతే ఒక వేళ మంచిదే కదా అనుకుంటూ గబగబా రెడీ అవ్వసాగాడు సిద్దు.

రెడీ అవుతున్న సిద్దు దగ్గరికి వచ్చిన అవ్వ బువ్వ తిని పో నాయినా అంది. అబ్బా ఇప్పుడు వద్దే కొంచం అయినాక వచ్చి తింటా అన్నాడు సిద్దు. అది కాదు సిదయ్య వచ్చే యాల కు ఏపాటి ది అయితాదో గందుకే ఒక ముద్ద తినెల్లు అంది అవ్వ.

లేదు అవ్వ జల్దిన్నే వస్త లే నువ్వు తినేసి ఉండు, బాబాయి వాళ్ళు పోయినారా అన్నాడు. పోతన సిద్దు అత్తకు నువ్వు తినక పోతే మనసుకు పట్టదు లే , పానాలన్ని నీ మీద నే పెట్టుకుంది అంటూ చెప్పులేసుకుని బయటకు నడిచింది పిన్ని. ఆ మాటలతో రాత్రి అవ్వ తో సరిగ్గా మాట్లాడక పోయేసరికి అవ్వ బాధ పడిందని అర్ధమైన సిద్దు.

అవ్వ ను దగ్గరికి తీసుకుంటూ అవ్వ నువ్వేం బాధ పడకు నేను తొందరగా వచ్చి నీతోనే ఉంటాను అన్నాడు. నాయినా సిద్దు నువు ఎప్పటిలా మతో కలిసి నవ్వుతూ ఉంటేనే నాకు సంతోషం రా అంది అవ్వ. సరే అవ్వ అలాగే ఉంటాను నేనేం బాధ పడతలేని అన్న ఏదో పని ఇప్పిస్తాడు అది చేసుకుంటా సరే నా అన్నాడు సిద్దు.

మా నాయినే నువ్వు మాతో కలిసి నవ్వుతూ అన్నం తింటేనే మాకు ఇష్టం అంది అవ్వ. సరే మళ్లీ వస్త అసలే అన్న తొందరగా రమ్మన్నాడు అంటూ బయటకు వెళ్ళాడు సిద్దు.

సిద్దు రాగానే ప్రవీణ్ రార అంటూ తన బండి పై ఎక్కించుకుని వెళ్ళాడు. ఎక్కడికన్నా అంటున్నా సిద్దు మాటలను వినిపించుకోకుండా కాస్త దూరం లో ఉన్న మండల కేంద్రము లో ఉన్న ఒక ఆర్. ఎం.పి హాస్పిటల్ ముందు తన బండి నీ అపెశాడు.

ఏంటన్న ఇక్కడ నా పని చేసేది. మరి నీకు పని ఎలా ఉంటుందా , అన్నాడు సిద్దు అనుమానంగా చూస్తూ . దానికి ప్రవీణ్ ముందు మా డాక్టర్ గారు నిన్ను చూడాలి అప్పుడు నీకు పని ఉందా, లేదా అనేది చెప్తాడు అన్నాడు ప్రవీణ్.

వామ్మో మీ డాక్టర్ నన్ను చూడడం ఏమిటో అనుకుంటూ లోపలికి వెళ్తున్న ప్రవీణ్ ను అనుసరించాడు సిద్దు. లోపల చాలా చిన్నగా ఉంది. హలు, లోపల ఇంకా రెండు గదులు ఉన్నాయి కానీ అంతా చీకటిగా వుంది. అంత చిన్న హాస్పిటల్ ముందు తెల్లని కారు కొత్త గా కనిపిస్తుంది.

ఇంత చీకటిగా ఉన్న ఈ హాస్పిటల్ కు జనాలు ఎలా వస్తున్నారో ఏమో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు సిద్దు.
***

ఏమయ్యా ప్రవీణ్ మళ్లీ ఎవరికీ ముడింది. మళ్ళీ ఎవర్నీ తీసుకుని వచ్చావు అంటూ నవ్వుతూ అడిగాడు డాక్టర్ వయసు యాభై పైగానే ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారు అన్నట్టు గా మెడ లో బంగారు గొలుసు , వేళ్ళకు ఉంగరాలు ఉన్నాయి.

అయ్యో సార్ మెల్లిగా వాడు మా ఇంటి పక్కనే ఉండేవాడు. నిన్ననే ఉద్యోగం పోయింది. మీకు పనికి వస్తాడేమో అని తెచ్చాను అన్నాడు ప్రవీణ్.

వెనకే వచ్చిన సిద్దు నమస్తే సార్ అన్నాడు. ఒహ్ నువెనా అది అంటూ ఏమయ్యా నీ ఫోన్ నంబర్ చెప్పు అన్నాడు ఫోన్ తీస్తూ , ఎందుకు సార్ అన్నాడు సిద్దు . చెప్పక పోతే ఇవ్వవా ఒక ఫోన్ చేసుకోవాలి అన్నాడు డాక్టర్. అయ్యో సార్ నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు అన్నాడు సిద్దు. ఓహ్ అవునా సర్లే నీ నంబర్ చెప్పు పని కావాలి కదా అన్నాడు డాక్టర్ అవును సర్ కావాలి అంటూ నంబర్ చెప్పాడు సిద్దు. ఎవరికన్నా చెప్తదేమో అనుకుంటూ ..

రెండు నిమిషాల్లో సిద్దు మొబైల్ కి రీఛార్జ్ వచ్చేసింది.అది కూడా మూడు నెలలకు సరి పడినా, అది చూసి ఆశ్చర్య పోయిన సిద్దు. ప్రవీణ్ షర్ట్ లాగుతూ అన్నా ఇదేంటి నాకు రీఛార్జ్ వేశాడు అంటూ అడిగాడు.

ఓహ్ అయితే వచ్చిందన్న మాటే కదా ఇంకెందుకు ఆలస్యం వెళ్లండి ప్రవీణ్ . సిద్దు నువ్వు కూడా వెళ్లి పనిలో దిగండి .. ఈ రోజు ఎలాగైనా అరు బాటిల్స్ నిండాలి. నువ్వు పెళ్లి అయిన వాడివి కాబట్టి నీవి రెండు రావడమే గొప్ప .. తొందరగా చేయండి అంటూ లోపలికి వెళ్ళాడు డాక్టర్.

ఏంటన్న ఇది బాటిల్స్ ఏంటి ఎలా నింపాలి వాటిని నాకు ఒక్క ముక్క అర్దం కాలేదు అన్నాడు సిద్దు. నేను చెప్తా రా అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు ప్రవీణ్ .

*

లోపల.. చూడ్డానికి చిన్నగా ఉన్నా లోపల బాగానే ఉంది. అందమైన అమ్మాయిల పోస్టర్స్ తో నిండి పోయింది ఆ గది. అవి చూసి షాక్ అయిన సిద్దు తో ప్రవీణ్ ..

ఒరేయ్ సిద్దు నువ్వు సిగ్గు పడాల్సిన పని లేదు. నికెప్పూడు మూడ్ వస్తె అప్పుడు హ్యాండ్ పంపు చేసుకుంటూ వచ్చిన దాన్ని ఇదిగో ఈ సీసాలో నింపాలి అంటూ చిన్న బాటిల్ ఇచ్చాడు ప్రవీణ్ .

ప్రవీణ్ ఏం చెప్తున్నాడు అర్దం అయ్యింది సిద్దు కి కానీ ఇలాంటి ప్లేస్ లోనా అంటూ ఇబ్బంది గా చూసాడు. దానికి ప్రవీణ్ సిద్దు ఒక్క బాటిల్ కి రెండు వేలు రా నువ్వు మూడు బాటిల్స్ నింపితే నికు ఆరు వెలు అంటే నువ్వు నెల రోజులు కష్టపడి సంపాదించేది ఇక్కడ ఒక్క రోజులో వస్తుంది . ఆలోచించు అంటూ తను ఒక పక్కగా వెళ్ళాడు బాటిల్ తీసుకుని….

ఆరు వెలు అంటే నెలలో మూడు రోజులు కష్ట పడితే దాదాపు ఇరవై వేలే ఇదేదో బాగుంది కదా అనుకుంటూ ఫోన్ తీసి అడల్ట్ మూవీ ఓపెన్ చేసి చూడసాగాడు. అలా మధ్యాహ్నం లోపే మూడు బాటిల్స్ నింపాడు సిద్దు. ప్రవీణ్ ఒక్క బాటిల్ మాత్రమే నింపాడు.

అది చూసిన డాక్టర్ సంతోషంగా ఇలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరూ ఉంటే బాగుండేది కదా ప్రవీణ్ అన్నాడు డబ్బులు చేతిలో పెడుతూ, హా అవును సర్ కానీ దొరకాలి కదా , నాకు బాగా కాళ్లు లాగుతున్నారు సార్ రోజు ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వండి అంటూ అడిగాడు.

హా అవును కదా ఇద్దరికీ ఇస్తా అంటూ ఏమయ్యా సిద్దు మరి ఇంత తొందర ఏంటయ్యా మధ్యాహ్నం వరకు అయిపోయింది . మంచి పని మంతుడివే అన్నాడు నవ్వుతూ.. సిద్దు సిగ్గుపడ్డాడు. డాక్టర్ ఇంజెక్షన్ చేశాక బండి నీ సిద్దునే నడపమని చెప్పాడు ప్రవీణ్. సిద్దు ప్రవీణ్ ఇంటికి బయలు దేరే సమయం లో సిస్టర్ ఆ బాటిల్స్ ఉన్న ఐస్ బ్యాగ్ ను కారు లో పెట్టడం చూసాడు సిద్దు. కానీ ఏమంత పట్టించుకోలేదు.

అలా వెళ్తుంటే ఉరి మొదట్లోనే అపించిన ప్రవీణ్ సిద్దు కి డబ్బులు ఇచ్చేసి, నీకు రేపు కూడా డబ్బు కావాలి అంటే రా అంటూ చెప్పి కల్లు దుకాణం లోకి వెళ్తుంటే అన్న సుది తీసుకున్నావ్ కదా అన్నాడు సిద్దు.

అరేయ్ నువ్వు ఇంటికి పో దానిది దానికే దీనిది దీనికే అయినా ఎక్కువ కాదు లే ఒకే సీసా అన్నాడు ప్రవీణ్ .

సరే నీ ఇష్టం అన్నా అంటూ తన గురించి ఎదురు చూస్తూ ఉన్న అవ్వ గుర్తొచ్చి ఇంటికి వెళ్ళాడు సిద్దు. బండి చప్పుడు విన్న అవ్వ ఇంటి బయటకు వచ్చి చూస్తూ , ఎరయ్యా ఇంత ఆలస్యంగా వచ్చావు. అందుకే చెప్పిన పొద్దున్నే ఇంత ముద్ద తిని పో అని అంది.

అవ్వ నాకు పని దొరికిందే ఇక మనకు డబ్బులే డబ్బులు అన్నాడు సిద్ధూ అవ్వ చేతిలో డబ్బులు పెడుతూ , ఆ చేతిలో ఇంకొక కవరు అవ్వ చేతికిచ్చి అవి చాలా రోజుల తర్వాత చికెన్ తెచ్చాను మంచిగా వండు కడుపునిండా తిని పడుకుంటా బాత్రూమ్ లోకి వెళుతూ..

సంతోషంగా ఉన్న మనుమడు చూస్తున్నా అవ్వ ఏమీ అనలేక పోయింది చేతిలో డబ్బు మరో చేతిలో చికెన్ కవర్ తీసుకొని లోపలికి వెళ్ళింది. చికెన్ వండి అంతలోపు సిద్ధూ బాత్ రూం లోకి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చాడు.

మనవడు రావడంతో రాయ తిందువు అంటూ పిలిచింది అవ్వ నువ్వు కూడా కూర్చో ఇద్దరం కలిసి తిందాం మొత్తం మన సాయంత్రం మళ్ళీ పిన్ని బాబాయ్ వచ్చే లోపు మళ్ళీ వండి పెట్టేద్దాం అన్నాడు. అవును చెల్లి ఎక్కడ ఉంది అని అడిగాడు.

బయట ఆడుకుంటుంటే రా సోపతి పిల్లలతో అంది అమ్మ వెంటనే సిద్దు బయటకు వెళ్లి తీసుకొని వచ్చాడు పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తనకి పెడుతూ ఇద్దరూ కలిసి తిన్నారు.

సిద్దు చాలా సంతోషంగా ఉండటం చూసిన అవ్వ ఇక ఏమీ అనలేకపోయింది తను కూడా ఒక కంచం లో పెట్టుకొని ముక్కలు వేసుకుని తిన సాగింది. తన మనవడు కష్టపడేది తన గురించే అని ఆ అవ్వకి బాగా తెలుసు కానీ ఇప్పుడు ఏం పని దొరికిందో అనే ఆలోచన మాత్రం ఓ వైపు తోలుస్తూ ఉంది. అయినా బయట పడకుండా వాడే చెప్తాడు అని అనుకుంది .

అయితే నిజానికి సిద్దు అవ్వ దగ్గర ఈ విషయాన్ని దాచాడు అన్ని విషయాల్లో తనకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు . అందుకే మనవడు అంటే చాలా నమ్మకం అవ్వకి ఏదైనా తనకి చెప్పే చేస్తాడు. వాడు సంతోషంగా ఉన్నాడు చాలు అని అనుకుంది అవ్వ.

************

రాత్రి పని నుంచి వచ్చిన బాబాయ్ పిన్ని కూడా సిద్దు కి పని దొరికింది అని తెలిసి చాలా సంతోషించారు ఎప్పట్లా సిద్ధూ తమతో సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. చాలా రోజుల తర్వాత వాళ్ళు వరి అన్నం చికెన్ కూర తిన్నారు కడుపునిండా.

అయితే వాళ్లు అనుకున్నట్టు సిద్దు ఆ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పని నుంచి రావడం రావడమే ఏదో తిన్నాను అనిపించి , మేడ పైకి వెళ్లి ఫోన్ చేస్తూ పడుకునేవాడు. ఇంకా కొత్తగా మూడు వచ్చే ఫోర్న్ చూస్తూ ఉండేవాడు.

అలా రోజులూ గడిచే కొద్ది డబ్బులు రాసాగాయి. కొత్త ఫోన్ కొన్నాడు. కొత్త బైక్ కూడా కొన్నాడు . కానీ అన్ని రోజులు మనకు అనుకులంగ ఉండవు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.

ఒక రోజు బాటిల్స్ నింపిన తర్వాత ఇంట్లో అందరికీ బట్టలు తీసుకున్న సిద్దు షాప్ లోంచి బయటకు వస్తుండగా డాక్టర్ గారి కారు వెళ్తూ కనిపించింది. దాంతో సిద్దు గబగబా అసలు ఈ డాక్టర్ మా బాటిల్స్ ఎవరికీ ఇస్తున్నది తెలుసుకోవాలనే కుతూహలం తో బట్టలన్నీ పక్కనే సెక్యూరిటీ లో అప్పగించి మళ్ళీ వస్తాను అని చెప్పి , బైక్ పై దూరంగా కారును అనుసరిస్తూ వెళ్ళసాగాడు.

కారు అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సిటీ లోని పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ ముందు ఆగింది. సిద్దు కూడా బైక్ దిగి అప్పుడే కొన్న మంకీ క్యాప్ పెట్టుకుని డాక్టర్ నీ అనుసరిస్తూ వెళ్ళాడు.

అది చాలా పెద్ద హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలూ ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఎవరూ సిద్ధుని ఆపలేదు. దాంతో సిద్దు డాక్టర్ వెనకే వెళ్ళసాగాడు. డాక్టర్ అలవాటు అయినట్టు ఒక గది లోకి వెళ్లి తలుపులు ముసాను అనుకున్నాడు. కానీ అవి సరిగ్గా పడకపోవడం తో , వాళ్ళ మాటలు అన్నీ సిద్దు కు బాగా వినిపించడం జరిగింది.

ఏమయ్యా ఈ మధ్య మరి ఎక్కువయి పోతుంది నీ యపరం, బాగానే సంపాదిస్తున్న వు కదా , మారి ఇంత ఆశ పనికి రాదయ్యా , నువ్వు ఇలా చేస్తే ఆ పిల్లలు సంసారానికి పనికి రాకుండా పోతారు. ఇప్పుడు వయసులో వాళ్లకి ఏమీ తెలియదు అందుకని ఎన్నిసార్లు కొట్టుకున్నా కొట్టుకో గలుగుతారు కానీ పెళ్లయిన తర్వాత గానీ అర్థం కాదు తాము ఏం కోల్పోయామో అనేది అప్పుడు మళ్ళీ మన దగ్గరికి పిల్లల కోసం అంటూ తిరుగుతారు అప్పుడు మనం మళ్ళీ ఎవరిదో వాళ్ళకి గర్భంలోకి పంపించాల్సి ఉంటుంది. ఇక నువ్వు పట్టుకున్న వాళ్ళని వదిలేసి ఎవరైనా కొత్త వాళ్ళని చూడు , ఇదిగో నీ డబ్బు అంటూ ఆరు లక్షలు అని టేబుల్ పై పెట్టాడు.

మిగిలిన సంగతి ఏమోగానీ ఆరు లక్షలు అని వినగానే సిద్దు ముఖం వెలిగిపోయింది. అలాగే ముఖం కూడా మాడిపోయింది. అంటే కష్టపడేది తాము లాభపడేది డాక్టర్ తమకు ఇచ్చేది అరు వేలు కానీ వాడు మాత్రం ఒక బాటిల్ కి రెండు లక్షల చొప్పున తీసుకుంటున్నాడు. ఇది నిజంగా శ్రమ దోపిడీ ఇన్ని రోజులూ కేవలం రైతులకు కూలి లను దోపిడీ చేసేవారు కానీ ఇప్పుడు నన్ను కూడా చేస్తున్నారు. వీడికి ఇలా కాదు గానీ మంచి బుద్ది వచ్చేలా నేనే చేయాలి. అని అనుకుంటూ వెనక్కి తిరిగాడు.

బైక్ మీద వెళ్తున్న సమయంలో సిద్దు ఛీ ఇన్ని రోజులూ ఎన్ని డబ్బులు లాస్ అయ్యానో అనుకుంటూ నేనే అదేదో పెట్టుకుంటే పొలా , వాడబ్బా వడెంటి మధ్యలో అనుకున్నాడు. ఇంటికి వెళ్తూ రెండు సీసాల కల్లు తీసుకుని వెళ్ళాడు.

పిన్ని రెండు అమ్లెట్లు వేసి ఇవ్వు అంటూ ప్రవీణ్ ఇంటికి వెళ్ళి అతన్ని పిలుచుకుని వచ్చాడు. వాళ్ళు ఇద్దరు అప్పుడప్పుడు ఇలా కూర్చుని తాగడం అలవాటు అయ్యింది. ప్రవీణ్ కి సిద్దు తనకు ఏదో పెద్ద పని అప్పగించ బోతున్నాడు అని అర్దం అయ్యి , ఏంట్రా సిద్దు ఏం పని అంటూ అడిగాడు.

అందుకు సమాధానంగా సిద్దు తన ఫోన్ లో రికార్డ్ చేసిన డాక్టర్ వాయిస్ వినిపించాడు. అది వినగానే ప్రవీణ్ ఆవేశ పడ్డాడు. ఇదేంటి రా మన శక్తిని అంతా పీల్చుకుని మనల్ని ఇలా మోసం చేశాడు ఆ డాక్టరు. ఇప్పుడేం చేద్దాం అంటూ అడిగాడు ప్రవీణ్.

మనమే మొదలు పెడదాం అన్నాడు సిద్దు. ఎలాగ మనకి ఎవరు తెలియరు కదా , ఎలా ముందుకు వెళ్లాలి అన్నాడు ప్రవీణ్ . తెలియడానికి ఏం లేదు అన్న నేను ఒక సైట్ లాంటిది చేస్తా అందులో మనలాంటి వాళ్ళను కొందరి ని తెచ్చి , వాళ్ళను వాడుకుంటూ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అన్నాడు సిద్దు.

అవును ఉన్నాడు నిన్న రాత్రి కూడా కలిశాను. ఈ పక్క సిటీ లో ఎప్పటి నుండో అడుగుతున్నాడు. కానీ నేను ఈ డాక్టర్ నీ నమ్మి మోసపోయాను అన్నాడు ప్రవీణ్.

అందుకే అన్న మనం కూడా ఇలాంటిది పెడదాం , మనలాంటి వాళ్ళని తీసుకుని వద్దాం, వాళ్లకు మనలాగా కాకుండా బాగా డబ్బులిచ్చి పంపిద్దం , నాలాంటి నిరుద్యోగులు బాగానే ఉన్నారు పల్లెల్లో , కళ్ళు మూసుకుని చేస్తారు అన్నాడు సిద్దు.

సరే రా నీ ఇష్టం , నువ్వెలా చెప్తే అలా చేస్తా నేను అన్నాడు ప్రవీణ్. సరే అన్న నాకు నువ్వుంటే చాలు అన్నాడు సిద్దు . ఆప్పటికప్పుడు ఏదో ఒక సైట్ లాంటిది చేసి దానికి పేరు పెట్టాడు. అందులో రిజిస్టర్ అయినా వాళ్లకు స్పెర్మ్ డొనేట్ అంటూ పెట్టాడు. కానీ అది ఎలా ముందుకు వెళ్తోంది అనుకుంటూ ఆ రాత్రి కలత నిద్ర పోయాడు సిద్దు.

****

తెల్లారి నుండి సిద్దు తన చుట్టూ పక్కల పల్లెలో తిరుగుతూ తనలాంటి వారిని నలుగురికి విషయం చెప్పి వాళ్లను తన దారి లోకి తెచ్చుకున్నాడు. ఉద్యోగాలు లేక , ప్రభుత్వం చేతులు ఎత్తెస్తే సరికి కులి పనులకు పోవాలంటే ఇజ్జత్ అడ్డు గా వచ్చిన కొందరు ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళు కొందరు దీనికి ఒప్పుకున్నారు.మారి కొందరు మాత్రం ఛీ ఛీ ఇంత బతుకు బతుకి, చదివి ఇలా చెయ్యాలా అంటూ నలుగురిలో మంచి అనిపించుకోవడం కోసం తాము రాలేము అంటూ బయటకు వెళ్లారు.

ఇటూ ప్రవీణ్ కూడా ఆ పక్కనున్న సిటీ కి వెళ్లి డాక్టర్ తో మాట్లాడి ఒప్పించుకుని వచ్చాడు. దాంతో సిద్దు అనుకున్నట్టే తనతో పాటు ఉన్న వచ్చిన వారి తో వ్యాపారం మొదలైంది.

కొత్తలో కొంత తత్తర పడినా రాను రాను వ్యాపారం బాగయ్యి, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. దాంతో సిద్దు ప్రవీణ్ ఇద్దరు మంచి ఇల్లు కట్టుకున్నారు. బాగా డబ్బులు రావడం తో గొప్పగా వారి గురించి చెప్పుకో సాగారు. ఏదో ఒకటి కష్టపడుతున్నారు అని అనుకోసాగారు అందరూ..అయితే

సిద్దు విషయం చెప్పగానే మాకు ఇలాంటి అవసరం లేదని అన్నవాల్లు మాత్రం తమ ముందే వెళ్ళిన వాళ్ళు ఊర్లో దర్జాగా బతకడం , వాళ్ల చేతుల్లో డబ్బులు చూసి కుల్లుకుని , తమంత తాము గా వెళ్ళలేక , తమని రమ్మని అన్నప్పుడు వెళ్ళని వాళ్ళు ఇది ఓర్వ లేక వాళ్లను ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనుకుని ,మెల్లిగా పోలీసులకు ఉప్పందించారు.

అసలే కార్పొరేట్ హాస్పిటల్ లో పేశట్లు తగ్గిన డాక్టర్ ఈ విషయం తెలిసిన మరు క్షణం పోలీసులను కలిసి ఎలాగైనా ఆ వ్యాపారం అపెయించమని దానికి తగిన డబ్బు ఇస్తామని అనడం తో పోలీసులు రంగం లోకి దిగారు.

రావడం రావడమే పోలీసులు పక్క ప్లాన్ తో రావడం తో ప్రవీణ్ , సిద్దు లను పట్టుకున్నారు. నా తప్పేం లేదు అంటున్నా కూడా ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ అందర్నీ మోసం చేస్తున్నారు అంటూ అరెస్ట్ చేశారు.

ఊరి జనం అంతా వాళ్ళు చేస్తున్న వ్యాపారం సంగతి తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అందరూ ఛీ ఛీ ఇదేం బుద్ధి , ఇదేం వ్యాపారం ఇంత చదువుకుని మరి ఇలాంటి పనులు చేస్తారా అంటూ అసహ్యిoచుకున్నారు. ఛీ మీ బతుకులు ఎందుకు రా అంటూ మోహన ఉమ్మేసారు.

వాళ్ళు అలా తిడుతుంటే లేదు లేదు ఇదంతా మేము కావాలని చెయ్యలేదు. ఇదంతా డాక్టర్ పన్నిన కుట్ర అతనే మొదలు మమల్ని ఇందులోకి లాగాడు. అతనే తప్పు చేశాడు అతన్ని అరెస్ట్ చేయండి అంటూ గట్టిగా అరవసాగాడు సిద్దు….

****

రెయ్ రేయి ఎంటా అరుపులు కేకలు అంటూ బకెట్ తో చల్లని నీరు గుమ్మరించింది సిద్దు పైన అవ్వ.

దాంతో ఒక్కసారిగా ఉల్లిక్కి పడి నిద్ర లేచిన సిద్దు కి ఇదంతా కల నా అనుకుంటూ హమ్మయ్య అనుకున్నాడు.

సిద్దు నీ చూస్తున్న అవ్వ మాత్రం ఒరేయి నువ్వు తొందరగా లేచి స్నానం చేసి నా దగ్గరికి రా అంటూ చెప్పి వెళ్ళింది లోనికి .

అవ్వ మాటల్లో కటిన్యత గమనించిన సిద్దు ఇంకేం మాట్లాడకుండా బాత్రూం లోకి వెళ్ళాడు.

రెయ్ సిద్దు నేను రెడీ పోదామా అంటూ వచ్చిన ప్రవీణ్ నీ కూడా అవ్వ లోనికి పిలిచింది.

అప్పటికే పనికి వెళ్లిపోయిన బాబాయి పిన్ని చెల్లి స్కూల్ కి వెళ్ళింది. దాంతో ఇల్లు అంతా నిశబ్దంగా ఉంది.

సిద్దు స్నానం చేసి రెఢీ అయ్యి అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ వాళ్ళ ఇద్దర్నీ. తమ ఇంట్లో ఉన్న ఇంటి దేవత అయినా దుర్గమ్మ గూటీ దగ్గరకు రమ్మని అక్కడ కూర్చోమంది. దాంతో ఇద్దరు కూర్చున్నారు.

అప్పుడు అవ్వ వాళ్ళతో. సిద్దయ్య మీరిద్దరూ ఏదో పాడు పని చేస్తున్నారు అని నాకు అర్థం అయింది. ఇది మంచిది కాదు బిడ్డ తెలిసో తెలియకో ఇన్ని రోజులూ చేశారు. ఇక చాలు అపేసి మీరు మంచిగా బతకడం నేర్చుకోండి.

సిద్దయ్య మీ అమ్మా నాన్న చనిపోతే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న , నువ్వు మంచిగా సదువుకుని ఉజ్జోగం చేస్తే చూడాలని అనుకున్నా, కానీ పెబుత్వం ఉజ్జోగాలు ఇయ్యం అన్నారు అని తెలిసి ఉన్న ఊర్లోనే ఏదో కట్టం చేసుకుంటున్నా వూ అనుకున్నా ,

కానీ నీ ఉజ్జాగం పోయాక నువ్వు వేరే పని దొరికింది అన్నప్పుడు మంచిదే అయి ఉంటుంది అనుకున్న ఎందుకంటే నువ్వు తప్పు చేయవు అని నాకు తెలుసు. సరే చేశావు కానీ అది చేసినన్ని రోజులు మనిషివి మనిషి లాగా లేవు , ఏదో పూనకం వచ్చినొడి లాగా ఉన్నావు. మాతో కలిసి లేవు . కలిసి తినలేదు ఉండలేదు.

పని పైసా అవసరమే బిడ్డా కానీ తప్పుడు దారి లో వచ్చే పైసా తో తిన్న బువ్వ రగతం తో సమానం. ఆ రాగతం కుడు మనకు వద్దు . చూడు మీ అమ్మ నాయినా చచ్చిన పొలం అని రెండెకరాల పొలాన్ని కూడా కాదని కూలి కి పని చేసుకొమ్మని నా బిడ్డని అంటే వాడు మారు మాట్లాడకుండా. అట్లనే చేశాడు. వాడి పెళ్ళాం కూడా మా.. సశేషం 

 

-భవ్యచారు 

పువ్వులు Previous post పువ్వులు
కరోనా..(ఆటవెలదులు) Next post కరోనా..(ఆటవెలదులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *