వివాదాస్పదమైన స్నేహం

వివాదాస్పదమైన స్నేహం

రాము, రవి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు.ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు.వారు ఇరువురు చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు.

ఇప్పుడు స్కూల్ స్టడీస్ పూర్తి చేసుకొని, కాలేజ్ కూడా ఒకే చోట జాయిన్ అవుతారు.ఇద్దరూ కలిసి వెళ్లి కలిసి వస్తూ ఉండే వారు.అలా ఉండగా వారి జీవితంలోకి శ్రీను అనే ఒక కొత్త వ్యక్తి వస్తాడు.

అది కొద్ది సమయంలోనే అతను కూడా రాము,రవి లకు మంచి స్నేహితుడవుతాడు.ముగ్గురూ కలిసి కాలేజ్ కి రావడం, కలిసి వెళ్లడం చేస్తూ ఉండే వారు.

అలా రోజులు హ్యాపీ గా సాగిపోతున్నాయి అనుకునే టైం కి ఏమైందో తెలియదు..రవి, రాముల మధ్య చిన్న చిన్న తగువులు అవుతూఉండేవి

వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ నే కదా వాళ్లే సర్దుకుంటారులే అని చుట్టూ ఉండే ఫ్రెండ్స్ పెద్దగా పట్టించుకునేవారు కాదు.
కాని రోజురోజుకి వారి మధ్య వివాదాలు పెరుగుతున్నాయే గానీ తగ్గేవి కావు.

అందరూ శ్రీనుని అడిగేవారు, ఏంటి వాళ్లు ఇద్దరు దూరం అయ్యే పొజిషన్ కి వస్తున్నా నువ్వు చూస్తూ ఉంటున్నావు గానీ వాళ్లకు ఎం చెప్పడం లేదు అని.

నేను చెప్తునే ఉన్నాను కాని వారు నా మాట కూడా వినడం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు శ్రీను.చిన్న చిన్న విషయాలకు కూడా రాము మీద ఊరికే చిరాకుపడేవాడు రాజు.

ఒకరోజు రాము కి అనుమానం వస్తుంది అసలు నాకు రాజు కి ఎందుకు గోడవ అయ్యింది, ఎలా అయ్యింది దీనికి కారకులు ఎవరైనా ఉన్నారా? అని ..అప్పుడు అతను ఆ దిశగా ఆలోచించడం మొదలుపెడతాడు.

మా మధ్య దూరం పెరగడానికి ఎవరో కావాలనే ఇది అంతా చేశారు , వాళ్లు ఎవరో ఎలా అయినా తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు.

తన ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తాడు.ఎంక్వయిరీ లో అతనికి తెలిసిన విషయం ఏమిటంటే శ్రీనునే కావాలని వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించాడు అని.

అతను అదంతా ఎందుకు చేశాడో రాముకి అర్థం కాదు.కారణం ఏంటో శ్రీను ని అడిగి తెలుసుకోవాలి అని, ఒకరోజు రాజు లేని టైం లో ఒంటరిగా వెళ్లి శ్రీను ని కలుస్తాడు .

ముందు రాము ఎంత అడిగినా శ్రీను నిజం చెప్పడు.దానితో కోపం వచ్చిన రాము శ్రీను ని రెండు దెబ్బలు వేస్తాడుఆ దెబ్బలకు తట్టుకోలేని శ్రీను ..

అవును మీ స్నేహం లో వివాదాలు రావడానికి నేనే కారణం.నాకు మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నచ్చలేదు..చిన్నప్పుడు మీరు ,మీ గురించే ఆలోచించే వారు గానీ వేరే వారిని మీతో కలుపుకునే వారు కాదు.

అలానే నా స్నేహాన్ని కూడా అప్పుడు వద్దు అన్నారు.తర్వాత నేను వేరే స్కూల్ కి వెళ్లడం వల్ల మీరు నన్ను మార్చిపోయినట్టు ఉన్నారు.

అందుకే ఇప్పుడు నన్ను గుర్తుపట్టలేదు.కాని నేను మీరు చేసిన అవమానాన్ని అస్సలు మర్చిపోలేదు.అందుకే మీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ మీ స్నేహంలో కలతలు సృష్టించాను.

ఆ కలతలే మీ స్నేహం లో వివాదానికి దారి తీసాయమీ వివాదాస్పప్తమైన స్నేహాన్ని చూసి నా మనసుకు ఎంత హాయిగా అనిపించిందో తెలుసా.ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను అంటూ పిచ్చిగా నవ్వుతూ అంటాడు.
అది చూసిన రాముకి కోపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది.

తను చేసిన పనుల గురించి శ్రీను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడే రాజు ని తీసుకొని అక్కడికి వస్తాడు వాళ్ల ఇంకొక ఫ్రెండ్.అక్కడ జరిగినది అంతా చూసిన రాజుకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది.

శ్రీను మాటలు విని రాము ని దూరం పెట్టినందుకు చాలా బాధగా కూడా అనిపిస్తుంది.
వెంటనే రాము దగ్గరికి వెళ్లి నన్ను క్షమించరా,

 

నీ గురించి పూర్తిగా తెలిసి ఉండి కూడా వీడు చెప్పిన అబద్దాలను నిజమని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టానూ అని అతని చేతులు పట్టుకొని అడుగుతాడు రాజు.

మనం ఫ్రెండ్స్ రా మనకి మధ్యలో క్షమాపణలు ఎందుకు చెప్పఇక నుంచి అయినా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి నన్ను దూరం పెట్టకుండా ఎప్పటికీ నాతో ఇంతకుముందు లా ఉండు రా నాకు అదే చాలు అంటాడు రాము.

ఇకపై నీ గురించి నువ్వే చెడుగా చెప్పినా నేను నమ్మను అంటాడు రాజఇద్దరు కలిసి ,మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని శ్రీను కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు.

తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని, కోప,తాపాలతో ఇన్ని రోజులు ఆగిపోయిన మాటలను నవ్వుతూ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు.

ఎవరో చెప్పిన మాటలు నమ్మి , వివాదాస్పదంగా మారిన స్నేహన్నీ, మళ్లీ దరిచేర్చుకున్న స్నేహితుల కథ ఇది.ఎవరూ ఇలాంటి మాయ మాటలు నమ్మి నిజమైన స్నేహాన్ని దూరం చేసుకోకండి.

-హైమ

Related Posts

1 Comment

  1. ఎవరు ఇన్ని చెప్పిన నిజమైన స్నేహం మళ్ళీ దగ్గర అవుతుంది అని చాలా బాగా ఒక కథ ద్వారా చాలా చెప్పావు హైమ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥰

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *