యోధ ఎపిసోడ్ 8

యోధ ఎపిసోడ్ 8

వాష్ రూమ్లో వాటర్ కారుతున్న శబ్దంతో లేచింది గౌతమి. (అంటే స్పృహ కోల్పోయిన తర్వాత ఇప్పుడే తను స్పృహ లోకి వచ్చిందన్న మాట! ఈ మధ్యలో జరిగిందేది తనకి తెలీదు)

అలా లేచిన గౌతమి చుట్టూ చూసింది. అంతా చీకటి వాతావరణం. ఉన్నట్టుండి ఆ వాటర్ కారుతున్న శబ్ధం కూడా ఆగిపోయింది. దీంతో భీతిల్లిన గౌతమి మొహం నిండా చెమటలు పడుతున్నాయి.

“పార్ధు… గోపాల్… కృతి…” అంటూ గట్టిగా అరుస్తుంది గౌతమి.కానీ, ఎవరి దగ్గర నుండి రెస్పాన్స్ లేదు. మరింత గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలుస్తుంది గౌతమి. అలా అరిచి అరిచి తన నోరు నొప్పెడితుంది తప్ప, ఎవరి దగ్గర నుండి ఉలుకూ పలుకూ లేదు. ఇంతలో …

“నువ్వెంత అరిచి ఘీ పెట్టుకున్నా నీ అరుపులు ఎవరికి వినపడవు. నిన్ను నా నుండి రక్షించడానికి రారు హా.. హాహ్హ… హాహ్హహ్హ…”

అంటూ ఒక భయకరమైన పెద్ద శబ్ధం మగ వాయిస్ తో కూడి సరిగా తన బెడ్ దగ్గర నుండి ఒక ఇరవై, ఇరవైదడుగుల దూరంలో నున్న మెయిన్ డోర్ నుండి వస్తుంది.

“ఎవరు…? ఎవరు…??” అంటూ ఆ అజ్ఞాత వ్యక్తిని ప్రశ్నించింది గౌతమి.

దానికి బదులుగా…

“హా.. హాహ్హ… హాహ్హహ్హ… హా.. హాహ్హ… హాహ్హహ్హ…” మరింత పగలబడి నవ్వుతున్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి

భయంతో గౌతమి 

“పార్ధు.. కృతి… ఎక్కడున్నారు” అంటూ తన స్వరం మరింత పెంచి, ఇంకాస్త గట్టిగా అరుస్తుంది.

“చెప్పా కదా ! ఎవరూ రారని, ఎందుకలా ఊరికే అరుస్తావ్…” అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి బదులిచ్చాడు.

“అసలు ఎవరు నువ్వు..? నీకేం కావాలి..? ఇక్కడికెందుకొచ్చావు..?” అంటూ భయపడుతూనే అతన్ని ప్రశ్నించింది గౌతమి.

“ఎందుకంత తొందర బంగారం! “చూడగానే వెంటనే గుర్తుపడతావు లే ..!” అంటూ తన మీద వెలుగును ప్రసరింప చేసుకుంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి, తను గౌతమి కనపడేట్టు.

“బక్క పలచని శరీరం, ఫార్మల్ డ్రెస్ వేసుకుని, ఇన్సర్ట్ చేసుకుని ఆ పై టై కట్టుకుని, క్లీన్ షేవ్ చేసుకుని, ఎత్తైన పళ్ళతో, కళ్ళద్దాలతో, నుదుట బొట్టు పెట్టుకొని చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడా ఆ వ్యక్తి.”

అతన్ని గౌతమి అలా చూడగానే,

“ను… ను… నువ్వు…?” అంటూ తడబడుతుంది.

“నే.. నే… నేనే… బంగారం! నీ బావని” అంటూ తన దగ్గరకి వచ్చి, తన పక్కనొచ్చి కూర్చున్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి.

“ను… ను… నువ్వు… చనిపోయావ్ కదా మళ్ళీ ఎలా వచ్చావ్ ?” అంటూ భిక్కు భీక్కు మంటూ గౌతమి అతన్ని అడుగుతుంటే

“చనిపోయానా..? ఎవరి వల్ల..? నీవల్లే కదా..? నేను లేకుండా నువ్వుండలేవు కదా! అందుకే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్దామని నీకోసం మళ్ళీ వచ్చాను” అంటూ బదులిస్తాడతను.

“నాకేం తెలీదు…! నా తప్పేం లేదు ….!! నన్నేం చెయ్యొద్దు…!!!” అంటూ గౌతమి అతనితో వారించగా…

“ఏంటి…? ఏం తెలీదా..? తప్పేం లేదా..? ఏం చెయ్యొధ్దా..?” అంటూ తన మొహాన్ని గౌతమి వైపు తిప్పి, “మనిద్దరికీ మాత్రమే తెలిసిన నిజాన్ని మళ్ళీ నీకు చూపించమంటావా?” అంటూ తన నుదుటిన బ్రొటన వేలిని పెట్టీ తనని గతంలోకి తీసుకెళ్తాడు ఆ వ్యక్తి.

**********

గౌతమి, గోవింద్ ఇద్దరూ బావా మరదల్లు. గోవింద్. గౌతమి కంటే మూడేళ్లు పెద్ద. గోవింద్ కి చిన్నప్పటి నుండి తన మరదలు గౌతమంటే అమితమైన ఇష్టం. వాళ్లింట్లో వాళ్ల తల్లి దండ్రులు, బంధువులు ప్రతిసారీ తనే నీ పెళ్ళాం అని తరుచుగా అనడం వల్ల కాబోలు, గోవింద్ కున్న ఆ ఇష్టం కాస్త గౌతమి మీద అంతకుమించిన ప్రేమగా మారింది.

గౌతమి అంటే గోవింద్ తల్లి దండ్రులకు, గోవింద్ అంటే గౌతమి తల్లిదండ్రులకు కూడా ఇష్టమే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని వాళ్ల చిన్నప్పుడే వాళ్ళు ఓ మాట అనేసుకున్నారు కూడా. ఇక ఒక్క గౌతమి నిర్ణయం మాత్రమే మిగిలింది. దాంతో వీళ్ళకి పెళ్లీడు వచ్చాక చూసుకుందాంలే అదంతా అని ఊరుకున్నారంతా!

అప్పటికే తన మీదున్న ఇష్టంతో, గోవింద్… గౌతమి కోసం చాలా ఖర్చులు చేశాడు. ఆపదలో ఉన్న గౌతమి కుటుంబానికి తాహతుకు మించిన సహాయాలు చేశాడు. ఆ కుటుంబానికి ఒక అండగా నిలిచాడు.

ఎగ్జాం ఫీజ్, కాలేజ్ ఫీజ్, కాలేజిలో జరిగే పార్టీలకి, బయట జరిగే పోటీ పరీక్షలకి డబ్బులాంటూ… తన అవసరాలకు మాత్రమే కాకుండా జల్సాలకు కూడా నిర్మొహమాటంగా గోవింద్ ని డబ్బులు అడిగేది గౌతమి. ఎంతైనా తను మనమ్మాయేనన్న ఉద్దేశంతో గౌతమికి ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా కాదనకుండా తీర్చేవాడు గోవింద్. ఈ క్రమంలోనే కాలేజ్ చదువులలో అడుగుపెట్టింది గౌతమి.

ఇక కాలేజ్ లలో కుర్రాళ్ళు, గౌతమిని తమ కపటి ప్రేమలలో పడేసి తనని తన్నుకుపోతారేమోనన్న భయం గోవింద్ లో కలిగింది. (మనం కూడా ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్నవి తరుచుగా చూస్తూనే వున్నాంగా.) ఇరుకుటుంబాల వారికన్నా గౌతమి అభిప్రాయన్ని ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అన్నట్టు ఆతృతగా ఎదురుచూస్తున్న గోవింద్

దాదాపు గౌతమి కొంచెం మెచ్యూర్ గా ఆలోచించే వయసు రావడంతో, తనపై గల అభిప్రాయాన్ని అడిగాడు. (ఎంత మరదలైతే మాత్రం తను కోరుకున్నట్లు, ఇంట్లో పెద్దవాళ్లు ఆశపడినట్లు, బలవంతంగా తన లైఫ్ లోకి తన మరదలు రావడం ఇష్టం లేకనో ఏమో, తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకున్నాడు గోవింద్.)

అడిగిన వెంటనే ఒప్పుకుంది గౌతమి కూడా… అలా వాళ్ల మధ్య ప్రేమ చిగురించింది. అప్పటివరకూ వారి మధ్య హాయ్.. బాయ్.. అంటూ మొహమాటంగానే సాగినా మాటలు కాస్త, ఇప్పటినుండి మరింతగా చనువు పెరిగి, కమ్యూనికేషన్ బలపడింది. ప్రేమికులు, అసలే బావా మరదళ్లు… తరచుగా వాళ్ల మధ్య అలకలు, కోపాతాపాలు ఎక్కువైయ్యాయి. ఎప్పుడూ గోవిందే కాంప్రమైజ్ అయ్యేవాడు. అలా అనుకోకుండా ఒక రోజు ఇద్దరి మధ్య ఏర్పడిన ఓ చిన్న బేధాభిప్రాయాం, చినికి చినికి గాలి వానలా మారింది.

“నన్ను నువ్వు అనుమానిస్తున్నావ్, నీతో వేగడం నా వల్ల కాదు” అంటూ కాల్ కట్ చేసి, ఆ ఫోన్ కాస్తా స్విచ్ ఆఫ్ చేసింది గౌతమి.

అంతకుముందు అలాంటి చిన్న చిన్న గొడవలు ఎన్ని జరిగినా తానెప్పుడూ అంత హార్ష్ గా బిహేవ్ చేయలేదు. కొంచెం కంగారు పడ్డాడు గోవింద్. ఆ రోజు వాళ్ళింటికి గౌతమి తల్లిదండ్రులు వచ్చారు. కానీ గౌతమి మాత్రం రాలేదు. ఎలాగైనా గౌతమిని ఈ విషయంలో బుజ్జగించాలని, ఒంటరిగానే ఆ నైట్ తన ఇంటికి వెళ్ళాడు గోవింద్.

అలా గౌతమి ఇంటికి వెళ్ళిన గోవింద్, వాళ్ల ఇంటి తలుపులన్నీ గడియపెట్టి ఉండడం గమనించాడు. ఇంట్లో ఒక్కత్తే ఉండడం వల్ల భయంతో అలా చేసి ఉండొచ్చని భావించి, కిటికీ నుండి తనని పిలుద్దామనీ అక్కడికి వెళ్ళాడు గోవింద్. గోవింద్ ఆ కిటికీ నుండి లోపలికి చూస్తుంటే తన హృదయం బద్దలయ్యే, తను అసలు ఊహించని సన్నివేశం గోవింద్ కంట పడింది. గౌతమి వేరొకరితో ఉండడం గమనించాడు.

(వాడొక ఆటో డ్రైవర్)

అప్పటికే తను అతనితో ఇంటిమేట్ అయ్యింది. గౌతమి, తనతో ఇంటిమేట్ అయిన వాడి ఒంటి మీద గుడ్డలు కూడా లేవు. ఇద్దరూ మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకుని మాత్రం ఉన్నారు. తన ఆవేశం కట్టలు తెంచుకుంది. లోపలికి వెళ్ళి వాళ్ళని చంపాలన్నంత కోపం గోవింద్ లో…. వెళ్దాం అనుకునే లోపు వాల్లేవో మాటలు మొదలుపెట్టారు. ఆ కిటికీ నుండి వాళ్ళు మాట్లాడుకుంటున్న సంభాషణని వింటూ అక్కడే నిలబడిపోయాడు గోవింద్….

“మీ బావ నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు కదా! తనని ఇలా మోసం చేయడం తప్పనిపించడం లేదా?” అంటూ గౌతమితో ఉన్న వ్యక్తి అడుగుతుంటే,

దానికి బదులుగా…

“ప్రేమించమని నేను చెప్పానా? అయినా ఆ తింగరోడిని ఎవడు చేసుకుంటాడు…? అసలు నాలాంటి దాన్ని ఆశించడానికి, వాడి మొహం అయినా ఎప్పుడైనా అద్దంలో కూడుకున్నాడో లేదో? ఎత్తుపల్లతో, కళ్లద్దాలు పెట్టుకుని సోడా బుడ్డి వాటం గాడు ” అంటుంది గౌతమి.

“హా..హా… హ్హ..(గౌతమి అన్న మాటలకు పగలబడి నవ్వుతూ) మరి అంత ఇష్టం లేనప్పుడు, తనని నీకోసం ఎందుకు ఖర్చుపెట్టించుకున్నవ్..? తనని ఎందుకలా వాడుకున్నవ్? పాపం కదూ..?” అంటూ ఎగతాలితో కూడిన జాలి చూపిస్తూ వాడు గౌతమిని అడుగుతుంటే

“అది నా తెలివేటలు, వాడి పిచ్చి తనం, వెర్రి తనం, అంతకు మించిన అమాయకత్వం! ఇందులో పాపం ఏముంది? అది వాడి ఖర్మ..!” అంటూ బదులిస్తుంది.

“మరి, మీ ఇంట్లో కాని, వాళ్ల ఇంట్లో వాళ్ళు కాని తనతో పెళ్లని బలవంత పెడితే..?” అని అతనంటుంటే

“ఛీ…! ఛీ..!! వాడితో పెళ్ళా..! ఆల్రెడీ అది కూడా అడిగారు ఇంట్లో మంచి జాబ్ తెచ్చుకోవాలని చెప్పా, తెచ్చుకుని అప్పుడు చెప్తా ఇంట్లో… వాడంటే ఇష్టం లేదని. నా ఇష్టాన్ని మా ఇంట్లో కాదనరు. ఒకవేళ వాళ్ళు కాదు కూడదు అంటే, చావనైనా చస్తాను కానీ, వాడితో మూడు ముళ్ళు కట్టించుకోను, ఏడడుగులు నడవను.” అంటూ పొగరుగా సమాధానమిస్తుంది.

“అదేంటి! నువ్వు ఇప్పటికే తనని ప్రేమిస్తున్నానని చెప్పానన్నావు..! దాన్ని ఆసరాగా చేసుకుని తను నిన్ను బెదిరిస్తే,” అని ఇంకో సందేహాన్ని బయట పెట్టగా…

“వాడి బొంద, వాడికంత సీన్ లేదు! నీ పనైందిగా ఇక నువ్వు బయల్దేరి వెళ్ళు, అసలే మా పేరెంట్స్ వచ్చే టైం అయ్యింది” అంటూ అతన్ని అక్కడి నుండి పెంపించే ప్రయత్నం చేస్తుంది గౌతమి.

ఆ కన్వర్జేషన్ అంతా అక్షరం పొల్లుపోకుండా విన్న గోవింద్ మనసు విరిగిపోయింది. గుండె బద్దలయ్యింది. ఆ క్షణం వాళ్ళిద్దరినీ చంపాలన్నంత కోపం తనలో కలిగింది. లేదు లేదు తనని అంతలా ప్రేమించి, తనకోసం అన్నీ చేసి, చివరికి తన దగ్గర వెదవైన అవమాన భారంతో… తనకు తానే చచ్చిపోవాలనంత ద్వేషం కలిగింది తనలో తనకే.

ఒకపక్క గౌతమంటే ఇష్టం, ఆ పై ప్రేమ… మరొక పక్క ఈ విషయం ఇంట్లో చెప్తే నమ్మడం సగంతి అటుంచితే వాళ్ళు గుండె పగిలి చస్తారు. గౌతమి చేసిన మోసాన్ని గోవింద్ జీర్ణించుకోలేకపోయాడు. అందుకే, జరిగిందేది ఎవరికి చెప్పకుండా అదే రాత్రి ఊరి చివర, విషం తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు గోవింద్. తమ కొడుకు ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడో తెలియని వాళ్ల తల్లి దండ్రులు, అత్త మామలు (గౌతమి తల్లి దండ్రులు) తల్లడిల్లిపోయారు. ఊరంతా తన మరదలు కాకుండా వేరొక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కారణమంటూ నిందలు వేసింది. తను ఇష్టాన్ని చెప్పేలోపు, బావ ఇలా అర్ధాంతరంగా చనిపోయాడంటూ అక్కడి వాళ్లందరినీ నమ్మించి సానుభూతి పొందిన గౌతమి ఆ ఊరి నుండి దూరంగా బంధువుల ఇంటికి వచ్చేసి, పై చదువులు చదువుకుంటుంది.

*************

ఆ గతం నుండి బయటకి తీసుకొచ్చిన గోవింద్ తో గౌతమి..

“బావా…! ప్లీజ్ బావా…!! నన్ను వదిలేయ్…! నేను చేసింది తప్పే..! అప్పుడేదో అలా తెలియక చేశా..! నన్ను క్షమించు…!” అంటూ గోవింద్ నీ బ్రతిమాలుతూ ప్రాధేయపడుతుంది.

“ఏంటమ్మా బంగారం… నువ్వు చేసింది తప్పని, ఇప్పుడు తెలిసిందా. ప్రాణం మీద అంత తీపున్న దానివి, ఎదుటి వాళ్ళ మనసులతో ఆడుకుంటూ… వాళ్లనెలా బలి తీసుకోవాలనిపించిందే? ఎదుటి వారివి ప్రాణాలు కాదా ?” అంటూ తనని మీద గట్టిగా గర్జిస్తూ అరుస్తున్నాడు. “నిన్ను ఇప్పుడు కనికరించి, వదిలేస్తే ఇంకెంత మంది బ్రతుకులు నాశనం చేస్తావో..?” అంటూ గౌతమి గొంతును గట్టిగా పట్టుకుంటాడు గోవింద్ ….

విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ బెడిసి కొడతాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గౌతమి, గోవింద్ తన రూపం మార్చుకుని వేరొక రూపం లోకి మారుతాడు. తనే యోగి… యోగేంద్ర… ఈ యోగి నుండి ఎవరూ తప్పించుకోలేరు అంటూ మరింత గట్టిగా నొక్కడంతో గౌతమి చివరికి తన ఊపిరి వదిలేస్తుంది.

ఎవరా యోగి..?

యోధ కి, యోగికి రిలేషన్..?

మిగిలిన నలుగురిలో ఇంకెంతమంది ఇలాంటి దారుణాలకు ఒడిగట్టి ఇక్కడికి వచ్చారు.

అసలు వాల్లేవరైనా ప్రాణాలతో బయట పడతారా?

వాళ్లు గడపాల్సిన వారంలో ఇప్పటికే మూడు రోజుల్లో ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మిగిలింది నలుగురు, అంటే ఈ నాలుగు రోజుల్లో వాళ్ళు కూడా….

ఏం జరగబోతుందో మిగిలిన భాగాలలో చూద్దాం “యోధ( ఓ ఆత్మ ఘోష )” ఇంకా ఉంది. తర్వాతి భాగం “యోధ(ఓ ఆత్మ ఘోష )-8” తో మీ ముందుకు వస్తా… అంతవరకూ… కొంచెం ఓపిక పట్టండి…….

– భరద్వాజ్

Related Posts