యోధ ఎపిసోడ్ 9

యోధ ఎపిసోడ్ 9

ఆ రోజు గురువారం. ఎప్పటిలానే తెల్లారింది. పార్ధుకి మెలుకవ వచ్చింది. చుట్టూ చూసాడు. తను తన రూంలోనే ఉన్నాడు. బయట నుండి గంట శబ్ధం. అంతకుముందు రోజు జరిగిందంతా ఎప్పటిలానే తనకి గుర్తుకు వస్తుంది. అక్కడి నుండి వేగంగా గౌతమి రూం వైపు పరుగు తీశాడు. అందులో గౌతమి లేదు. అంతా చూసాడు కానీ, లాభం లేదు. బయటకు అంతే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు.

ఈ సారి.. ప్రియ, అవేశ్ రూమ్స్ రెండూ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి.

కృతి, గోపాల్, విశాల్ ల రూం డోర్స్ తడుతూ వాళ్ళని నిద్ర నుండి లేపుతూ బాల్కనీ లోకి పరుగుతీసాడు. ఎప్పటిలానే అక్కడ కూడా కాలుతున్న చితి. అంటే గౌతమి కూడా… అప్పటికే అక్కడికి చేరుకున్న వాళ్ల స్నేహితులతో పాటు పార్ధు దుఃఖానికి కూడా అవధుల్లేవ్…

గౌతమి లేదన్న విషయం తెలిసి, గోపాల్ కి అయితే కోపం నాషాలాన్నింటింది. వాళ్ల దగ్గర నుండి పరిగెత్తుకుంటూ గౌతమి రూం లోకి వెళ్లి,

“హేయ్… ఎవర్తివే నువ్వు..? ఎక్కడున్నావే…? రావే…? అసలేం చేసామే మేము? మమ్మల్ని బలి తీసుకుంటున్నావ్..? నీకు దమ్ముంటే, ఇప్పుడు.. ఈ క్షణం… నా కళ్ళ ముందుకు రావే నువ్వో నేనో తేల్చుకుందాం…!” అంటూ పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తూ భీకరంగా అరుస్తున్నాడు.

ఆ అరుపులు విని కంగారు కంగారుగా అక్కడికి వచ్చారు వారంతా… గోపాల్ ని కంట్రోల్ చేస్తూ, అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్లంతా. కానీ, గోపాల్ వాళ్లెవరనీ లెక్క చేయడం లేదు. అసలే అవేశ్, ప్రియలతో పాటు తను ఇష్టపడిన గౌతమి కూడా దూరమైన బాధలో ఉన్నాడు. అక్కడున్న వస్తువులన్నింటిని గాల్లోకి విసిరెస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.

పార్ధు… విశాల్… కృతి తనని ఎంత ఆపుదామని ప్రయత్నిస్తున్నా… వాళ్ళని పక్కకి నెడుతూ.. ఆ గది నుండి బయటకి వచ్చి, కిందికి వెళ్లి ఆ హల్ కూడా అంతే పిచ్చి గా బిహేవ్ చేస్తూ అక్కడున్న వాటిని గాల్లోకి విసిరికొడుతున్నాడు కోపంగా. విశాల్, పార్ధు, కృతి తన దగ్గరికి వెళ్ళి తనని ఎంత కంట్రోల్ చేద్దామన్నా వాళ్ళకి తను లొంగడం లేదు.

ఈలోపే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పైన వాళ్ల రూం డోర్స్ టపా… టపా… మంటూ ఒకటే కొట్టుకుంటున్నాయి. దాంతో విశాల్ మరియు పార్ధు కంగారు కంగారుగా పైకి వెళ్ళారు.

పార్థుకి ఆ శబ్దాలు తన రూం నుండి వస్తున్నట్టనిపిస్తుంది. అలాగే విశాల్ కి కూడా ఆ శబ్దాలు తన రూం నుండే వస్తున్నట్టనిపిస్తుంది. దాంతో ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళారు. అలా వెళ్లిన వాళ్ళకి వాళ్ల రూమ్స్ లో ఆహారం అప్పటికే ఎవరో తెచ్చిపెట్టినట్టుగా ఉంది. కింద… గోపాల్ ఇంకా అలానే బిహేవ్ చేస్తూ చేస్తూ కాసేపటికి నీరసంతో కుప్పకూలాడు… కృతి వైపు దీనంగా చూస్తూ

“చూడు కృతి, ఆ పిశాచి ఇప్పుడు నా గౌతమిని కూడా తీసుకెళ్ళిపోయింది. నాకింకా తోడేవరు…?” అసలు ఈ సారి కనుక నాకది ఎదురుపడాలి, దాని అంతు చూస్తా..?” అంటూ గాంభీర్యాలు పలుకుతున్నాడు. కృతి నుండి రెస్పాన్స్ లేదు.

“ఏంటి కృతి ? నేనింత ఆవేదనతో మాట్లాడుతుంటే, ఉలుకు పలుకు లేకుండా అలా మౌనంగానే ఉన్నావ్… ఓహ్… ఆఖరికి నువ్వు కూడా భయం పడుతున్నావా..?” అంటూ తనని ప్రశ్నిస్తాడు.

“ఏం భయపడకు… దాని సంగతి తెలుస్తా..!” అంటూ తనకి దైర్యం చెప్తుంటే,

“అవునా..! అయితే తేల్చు మరి..!” అంటూ కృతి నుండి బదులోస్తుంది.

“తప్పకుండా..! తేలుస్తా” అంటూ గోపాల్ అంటుంటే, 

“మాటలు కాదు రా! చేతల్లో చూపించు..!” అంటూ ఇంకొంచెం స్వరం పెంచి, ఒక గంభీర్యమైన వాయిస్ తో బదులిస్తుంది కృతి.

“కృతి… కృతి… నువ్వేనా..?” అంటూ తనని గోపాల్ అడుగుతుంటే,

“హా… హాహ్హ.. హాహ్హాహ్హా… హా… హాహ్హ.. హాహ్హాహ్హా…” అంటూ బిగ్గరగా, భయంకరంగా నవ్వుతుంది కృతి…

“హేయ్… ఎవరునువ్వు..?” అంటూ పడిన గౌతం పైకి లేస్తూ అడుగుతుంటే,

“నువ్వేదో ఆ పిశాచి అంతు తేలుస్తా..!” అంటూ భీరాలు పలికావ్ కదరా? ఇప్పుడు ఆ పిశాచే నీ ముందుంది, రా…! రారా..!! ఇప్పుడు తేల్చు నా అంతు” అంటూ గాలి వీస్తే ఎగిరే జుట్టు కురులతో, కళ్ళు రెండూ పెద్దవి చేస్తూ.. గాట్లు పడిన మొహంతో.. గోపాల్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది కృతి.

కృతి కాదు కృతి శరీరంలోకి అప్పటికే ప్రవేశించిన ఆత్మ. అప్పటికే కృతి శరీరంలోకి దెయ్యం ప్రవేశించిందని గ్రహించిన గోపాల్… దాంతో…

“అసలు ఎవరే నువ్వు..? నీ కోసమే ఎదురుచూస్తున్నానే, నీ అంతు చూస్తా…!” అంటూ తన మీదకి వెళ్తూ, దాడి చేయబోతుంటే, ఆ దాడిని తిప్పికొడుతూ…

“ఏంట్రా నువ్వు నా అంతు చూసేది ?” అంటూ 

గోపాల్ రెండు చేతులను గట్టిగా పట్టుకుని, వాటిని ఎడంగా జరుపుతూ తనని పైకి ఎత్తి ఒక్క విసురుగా గోడకేసి విసిరికొట్టింది. అప్పటికే నీరసించి పోయిన గోపాల్… ఆ పిశాచి దాడికి తట్టుకోలేక “పార్ధు, విశాల్..” అంటూ గట్టిగా అరుస్తున్నాడు.

అది విన్న పార్ధు, విశాల్… వాళ్ల వాళ్ల రూమ్స్ నుండి రావడానికి ప్రయత్నిస్తుంటే, ఆ రూమ్స్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి, బయట నుండి ఎవరో లాక్ చేసినట్టుగా. అందులో నుండి బయట పడడం వాళ్ల వల్ల కావడం లేదు.

ఇంతలో గోపాల్ దగ్గరికి వచ్చిన కృతిలోనున్న ఆ ఆత్మ… తన మోహంలో మొహం పెట్టి… 

“నిన్ను నా నుండి ఎవరూ రక్షించలేరు…. ఇక్కడ నుండి నిన్ను ఎవరూ కాపడలేరు…… నువ్వెంత అరిచి మొత్తుకున్నా నీ ప్రాణాలు నిలపడం ఎవరి తరం కాదు..? హా… హాహ్హ.. హాహ్హాహ్హా… హా… హాహ్హ.. హాహ్హాహ్హా…” అంటూ బిగ్గరగా, మరింత భయంకరంగా నవ్వుతుంది.

“అసలు ఎవరు నువ్వు..? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్..? నీకేం కావాలి…?” అంటూ గోపాల్ ప్రాధేయపడుతున్నాడు.

“హా… హాహ్హ.. హాహ్హాహ్హా… కాసేపటి క్రితం, ఏవేవో కారు కూతలు కూసావ్..? నా అంతు తేలుస్తా, చూస్తా.. అంటూ ఇప్పుడేంటి నీ ప్రాణం మీద ఆశ పుట్టుకొచ్చిందా…? అంతలా బ్రతిమాలుడుతున్నావ్..? అంటూ గోపాల్ కాలర్ పట్టుకుని, ఒకేసారి గాల్లోకి తనని విసిరికొడుతుంది ఆ ఆత్మ.

అలా విసిరికొట్టడంతో… గాల్లోకి ఎగిరి పై ఫ్లోర్ లోనున్న రైలింగ్ నీ ఢీ కొట్టి మళ్ళీ కింద పడతాడు గోపాల్. దాదాపు నాలుగు మీటర్ల హైట్ ఉంటుంది ఫ్లోర్ తో ఫ్లోర్. అంత హైట్ నుండి పడ్డాక గోపాల్ నడుం విరిగింది. దాంతో తన వేదనకు అవదుల్లేవ్..

“పార్ధు… విశాల్… నన్ను రక్షించండి..! ప్లీజ్ .. ప్లీజ్… కిందకి రండి… నన్ను రక్షించండి..!! ఇది నన్ను కూడా చంపేస్తుంది” అంటూ మరింత గట్టిగా అరుస్తున్నాడు గోపాల్…

గోపాల్ ఆర్తనాదాలు వింటున్న పార్ధు మరియు విశాల్… లోపలి నుండి వాళ్ల రూం డోర్స్ నీ కొడుతూ వాటిని బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. వారి వల్ల అదికాక,

“ఎవరు నువ్వు… గోపాల్ ను ఏం చేస్తున్నావ్…? ప్లీజ్ అతన్ని వదిలిపెట్టు… కావాలంటే నన్ను ఏమైనా చేసుకో ..? అంటూ పార్ధు తనకి కూడా తెలియని ఆ ఆత్మ నీ వేడుకుంటున్నాడు.

“గోపాల్… గోపాల్.. అసలెక్కడున్నవ్… నా రూం డోర్ క్లోజ్ అయ్యింది… బయట నుండి ఓపెన్ చేయడానికి ట్రై చెయ్యి… కృతి … కృతి… నువ్వెక్కడున్నావ్ .. కనీసం నువ్వైనా ఇక్కడికి వచ్చి రూం డోర్ ఓపెన్ చెయ్యి” అంటూ విశాల్ తన రూం లోపలి నుండి అరుస్తున్నాడు.

దానికి బదులుగా గోపాల్ … 

“కు.. కు.. కృతి… (కృతి శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశించిందనీ వాళ్ళతో చెప్పాలనుకుంటున్నాడు) అంటూ తన శక్తినంతా కూడా గట్టుకుని చెప్దామనుకుంటుంటే, ఈ లోపే కృతి రూపంలోనున్న ఆ ఆత్మ గోపాల్ దగ్గరకి వచ్చి, తన మోహంలో మొహం పెట్టి, కళ్ళు పెద్దవి చేసి, గోపాల్ వైపు మరింత భయంకరంగా చూస్తూ…

“ఏం చెప్తావ్ రా..!” అంటూ తన గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. 

దాంతో సరిగా ఊపిరందక సొమ్మసిల్లి పడిపోతాడు గోపాల్. మరొకపక్క… పార్ధు… విశాల్ తమ తమ రూమ్స్ నుండి గోపాల్.. కృతి… అంటూ వాళ్ళని పదే పదే పిలుస్తున్నా, వారి దగ్గర నుండి సరైన రెస్పాన్స్ లభించదు.

**********

కొంతసమయం తర్వాత, స్పృహ కోల్పోయి పడిపోయిన గోపాల్ కి ఏదో విజిల్ శబ్ధం వినిపిస్తుంది. ఆ శబ్దానికి మెలుకువ వచ్చి, లేచి చుట్టూ చూస్తాడు. అంతా చీకటి, తానొక బెడ్ పై ఉన్నట్టు గమనిస్తాడు. ఇంకా ఆ విజిల్ శబ్ధం అలానే వస్తుంది. ఎక్కడి నుండి వస్తుందో సరిగా తెలియడం లేదు. కానీ, తన చుట్టూ ఒకటే మోగుతుంది. ఆ బెడ్ మీద నుండి లేద్దామన్నా లేవలేని పరిస్థితి. అప్పటికి తనకింకా నీరసం అలానే ఉంది. ఒంటి నిండా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అప్పటికే నడుము కూడా విరిగి అసలు ఆ బెడ్ పై నుండి లేవలేని పరిస్థితి.

“ఎవరు నువ్వు…? నేనెక్కడున్నాను..? నన్నేం చేయబోతున్నావ్..?” అంటూ అడుగుతూ… 

“పార్ధు…, పార్ధు…, విశాల్…, విశాల్… అంటూ తన స్నేహితులను పిలుస్తున్నాడు.

అలా ఎంత పిలిచినా వాళ్ల దగ్గర నుండి ప్రతిస్పందన లేదు. విజిల్ శబ్ధం ఇంకా ఆగలేదు. తన కంటికి కనిపించని ఆ అజ్ఞాత వ్యక్తి, గోపాల్ చుట్టూ తిరుగుతూ ఆ విజిల్ శబ్ధం అలానే చేస్తున్నాడు. ఆ విజిల్ ని అలా పదే పదే వినగా, అది ఎక్కడో విన్నట్టు తనకి గుర్తుకువస్తుంది. విన్నట్టు కాదు ఒకప్పుడు ఆ విజిల్ ని తనే ఎక్కువగా యూజ్ చేసినట్లు తనకనిపిస్తుంది. దాంతో ఎక్కడో విన్నట్టు ఉందే? అంటూ తనలో తాను మధన పడుతుంటాడు.

ఒక్కసారిగా ఆ విజిల్ శబ్ధం ఆగిపోతుంది.

“ఏంటి ఎంత ఆలోచించినా ఇది ఎక్కడ విన్నావో గుర్తుకు రావడం లేదా?” అంటూ ఒక ఆడ స్వరం విపిస్తుంది ఆ చీకట్లో నుండే…

“ఎవరు నువు…? ఎవరు నువు…?” అంటూ గోపాల్ తనని అడుగుతుంటే,

“నా వాయిస్ కూడా గుర్తు పట్టలేక పోతున్నావా..?” నేను నీకంత కానిదాన్ని అయిపోయానా..? నన్ను మర్చిపోయావా..?” అంటూ మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తుంది గోపాల్ నీ…

“నాకేం గుర్తుకురావడం లేదు… అసలు నువ్వెవరు… నాతో నీకేం పని…” అంటూ మళ్ళీ మళ్ళీ అడుగుతాడు గోపాల్ కూడా

“చెప్తా… చెప్తా…. నీకంతా వివరించి చెప్తా” అంటూ….

ఆ ఆజ్ఞాత వ్యక్తి తనపై తాను వెలుగును ప్రసరింపజేసుకుంటుంది. ఎర్రటి పెదాలు, నున్నని చెంపలు, చెవులకి చేర్చిన కెంపులు, విరబూసిన కురులు, కలువరేకుల్లాంటి కళ్ళు, మొత్తానికి చంద్రబింబం లాంటి ముఖాకరం ఆ కాంతిలో ఆ మొహం మరింత మెరుస్తూ బార్బీ గర్ల్ లా కనిపిస్తుంది. తనని చూసిన గోపాల్, వెంటనే గుర్తుపడతాడు.

“నువు.. నువ్వు…” అని అతడంటుండగా… 

“హా … నేనే నీ మధులతని, ఇప్పటికైనా గుర్తుపట్టావా?” అంటూ “హా…హా..హా….” అంటూ మరింత గట్టిగా పగలబడి నవ్వుతుంది. నువు చేసిన మోసానికి బలైపోయిన ఓ ఆడ కూతురిని, ప్రేమించు… ప్రేమించు అని నా వెనుక కుక్కలా తిరిగి, ఇప్పుడు నేను గుర్తు చేస్తేనే కానీ, గుర్తుకురానంత పరాయి దాన్ని అయ్యాను అన్న మాట!

“అది కాదు మధు… నేను చెప్పేది విను!” అని గోపాల్ అంటుంటే

“ఏంట్రా కుక్కా .. నువ్వు చెప్పేది, నేను వినేది…!” అంటూ గట్టిగా అరుస్తుంది.

“నేనే చెప్తా, నువ్వు విను…! నేనడిగిందానికి ముందు సమాధానం చెప్పు..!! అంటూ గోపాల్ నీ గట్టిగా నిలదీస్తుంది. నా వెంట ఎందుకు పడ్డావ్..? విజిల్స్ వేస్తూ పదే పదే నా వెనుక ఎందుకు తిరిగావ్..? నీ మీద జాలి పడి నీతో స్నేహానికి ఒప్పుకుంటే, ప్రేమ పేరుతో నాకెందుకు దగ్గరయ్యావ్..? వద్దూ వద్దు అని ఎంత వారిస్తున్నా, నా మీద నమ్మకం లేదా అంటూ నన్నెందుకు లోబర్చుకున్నవ్..? ఆఖరికి పీరియడ్స్ టైమ్స్ లో కూడా… నొప్పి వస్తుందన్నా వినకుండా నీ కోరికలు తీర్చుకున్నావ్.. అంత నమ్మిన నేను, నీకు సర్వస్వం అర్పిస్తే, నీ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలిసి కూడా మొహం చాటేసావ్..

నాతో కాకుండా ఇంకెంత మందితో తిరుగావో అంటూ నన్ను హేళన చేసావ్.. అబార్షన్ చేయించుకో, ఖర్చులకి డబ్బులిస్తాను అంటూ నన్ను లోకువ చేసావ్… దానికి నేను నిరాకరించే సరికి నన్ను నీ ఫ్రెండ్స్ తో కలిసి దారుణంగా, అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు కదా రా..! ఇప్పటికీ నా తల్లి దండ్రులకు, ఊళ్లోవాల్లకి నేను ఏమయ్యనో తెలీదు. ఎవరితోనో లేచిపోయానని నా మీద ఒక చెరగని ముద్ర వేశారు… ఎందుకు… ఎందుకు… ఇదంతా చేసావ్…

నా జీవితాన్ని ఎందుకు ఇంత నాశనం చేసావ్ ? నేను నీకేం అన్యాయం చేశాను ..? నిన్ను నమ్మిన పాపానికి నాకు తగిన శాస్తి జరిగింది.. అంటూ అక్కడే బోరున విలపిస్తుంది ఆ ఆత్మ అదే మధులత.

“ప్లీజ్ మధు… నన్ను … నన్ను … ఏం చెయ్యకు.. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను.. కావాలంటే ఇప్పుడే పోలీసులకి లోంగిపోతాను, నన్ను ఇక్కడి నుండి బయట పడేయి. అంతేకాని, నన్ను చంపొద్దు..!” అంటూ వేడుకుంటాడు.

“నీ వరకూ వచ్చేసరికి ప్రాణం మీద అంత మమకారం వచ్చేసిందా…? అవతలి వాళ్ళవి ప్రాణాలు కావా? నీ మార్పు ఎవరికి కావాల్రా..? నువ్విప్పుడు చట్టానికి లోంగినా ఏం ఉపయోగం? ఏళ్ల తరబడి నిన్ను మేపి, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఈ సమాజంలోకి వదిలేస్తారు…. దాని వల్ల నాకు ఒరిగేది ఏంటి? నా పగ చల్లారుతుందా? నాకు న్యాయం జరుగుతుందా..? నీకు శిక్ష పడాల్సిందే..? అది కూడా నా చేతులతో చంపితెనే నాకు తృప్తి” అంటూ విరగబడి నవ్వుతుంది.

దాంతో అసలే ఆవేశ పరుడైన గోపాల్, 

“నిన్ను ఇలా కాదే?” అంటూ తన పీక పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. (ఆ క్షణం మధులత ఒక ఆత్మ అన్న విషయం మర్చిపోయి…)

” ఇంకా నేను నీ బానిస అనుకున్నావ్ రా..?  యోధ..! యోధ…!!” అంటూ తన రూపాన్ని మార్చుకుంటూ, తన చేతి వేళ్ళతో గోపాల్ తలను పట్టుకుని, అవి మెడ ద్వారా లోపలికి చొప్పించి ఒక్కసారిగా తన మొండెం నుండి గట్టిగా తన తలను పీకేస్తుంది. దాంతో గోపాల్… తల, మొండెం రెండూ వేరవుతాయి. అక్కడితో గోపాల్ చాప్టర్ కూడా క్లోజ్ అవుతుంది.

“ఈ కథకు అంతం ఎక్కడ..?

అందరి చావేనా..?

ఒక్కొక్క రోజు ఒక్కక్కరిగా వాల్లు చేసిన కుతంత్రాలు బయటపడి బలవుతున్నారా?

అంటే మిగిలిన వాళ్లు కూడా ఇంతేనా..?

యోగి వస్తుంటే, యోధ రావడం లేదు…

యోధ వస్తుంటే, యోగి రావడం లేదు…

అసలు వీల్లేవరూ? వీళ్ళ ప్రణాళిక ఏంటి?

వీరిద్దరికీ గల సంబంధం ఎప్పుడూ బయటపడుతుంది”

తెలుసుకోవాలంటే, మిగిలిన భాగాలు అసలు మిస్ కాకండి “యోధ (ఓ ఆత్మ ఘోష)” ఇంకా కొనసాగుతోంది. తర్వాతి భాగం “యోధ (ఓ ఆత్మ ఘోష)-10” లో కొనసాగిస్తాను…

– భరద్వాజ్

Related Posts