యువరాణి

యువరాణి

ఒక రాజ్యం లో ఒక కోటకు ఒక యువరాణి.. ఆ యువరాణికి అన్నీ విధాల సౌకర్యములు అందుబాటులో ఉంటాయి ఎల్లపుడూ.. తను చిటికేస్తే అన్ని తన కాళ్ళ ముందు అర క్షణం లో ఉంటాయి.. కానీ ఆ యువరాణి కి మాత్రం అది కారాగారం లా ఉండేది…

ఎందుకంటే తనచుట్టూ ఉన్న సైనికులు, తనకి కాపలాగ ఉండి తనని కాలు కూడా బయట పెట్టనిచ్చే వారు కాదు. ఎందుకంటే అది రాజు గారి ఆదేశం.. కానీ రాణి గారికి ఇది ఏ మాత్రం నచ్చక పోయేది… ఎప్పుడూ దిగులుగా ఉండేది…

ఎవరు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా తన మనసు కుదురు గా ఉండేది కాదు…. తను ఒక రామ చిలుకని పంజరంలో బందించి దానితో కబుర్లు చెప్పేది.. మనసులు అర్దం చేసుకోలేని మనుషులు.. మధ్య ఉంటున్నాం… వీళ్లకు ఎప్పటికీ అర్దం కాదేమో ఇక నా మనసు ఎం కోరుకుంటుంది అనేది.. అని ఆ పంజరం లోని చిలుక తో తన బాధను పంచుకునేది ఆ రాణి ప్రతి రోజు

ఒక రోజు తన గోడు విన్న రామ చిలుక… రాణి తో ఇలా అంటుంది.. రాణి గారు నేను మీకు ఒక విషయం విన్నపించుకోవాలి అనుకుంటున్న అంటుంది… అపుడు రాణి గారు ఏమిటది ..? అంటుంది..

రాణి గారు మీ చుట్టూ ఇంత మంది సైన్యం, మంత్రులు, చెలికత్తెలు, ఉన్నారు కాదా అని అపుడు రాణీ హా అవును అంటుంది.. అపుడు ఆ రామ చిలుక.. రాణీ గారు.. ఒకసారి ఆ ఆకాశం లో ఎగిరే రామ చిలుకని చూడండి.. అని చూపిస్తుంది. అపుడు ఆ రాణి ఎగిరే రామ చిలుక నీ చూసి మురిసి పోతుతూ…. చాలా సంతోషం తో ఎంత ఆహ్లాదంగా విహరిస్తూ ఉంది కదా.. నేను కూడా అలా రెక్కలు కట్టుకుని ఎగిరితే ఎంత బాగుంటుందో కదా అంటుంది రాణి..

అపుడు ఆ రామ చిలుక ఒక నవ్వు నవ్వుతుంది… రాణి గారు, ఏమైంది చిలక ఎందుకు ఆ నవ్వు అని అడుగుతుంది అమాయకంగా… అపుడు రామ చిలుక… ఇలా అంటుంది రాణి తో… నీ చుట్టూ ఇంత మంది ప్రతి నిమిషం నీ వెన్నంటే ఉంటారు.. నీకు ఏ ఆపద రాకుండా వారి ప్రాణాలను అడ్డు వేస్తారు.. నీకు ఎం కావాలో అది అడిగి తెలుసుకుని మరీ నీ ముందుంచుతారు.. అయినా నీకు ఒంటరి తనం లా అనిపిస్తుంది…

ఇక్కడ ఉన్న సౌకర్యాలను వదిలి ఎక్కడ ఎలా ఎం ఉంటాయో కూడా తెలియని వాటి గురించి ఊహిస్తూ, లేని రెక్కలు కట్టుకుని మరీ ఎగరాలి అనుకునే నిన్ను చూసి నవ్వొచ్చింది.. రెక్కలు ఉన్న ఎగరలేని.. ఎన్నో దిక్కులు విహరించే నాకు ఏ దిక్కు లేకుండా.. ఈ పంజరం లో బందించావు…. మరి నేనేం అనాలి రాణి గారు మిమ్మల్ని అందుకే నాకు నవ్వు వచ్చింది అంటుంది ఆ రామ చిలుక…

అమయకంతో కళ్ళు మూసుకున్న రాణి వారు ఆ రామ చిలుకని క్షమాపణ కోరి, తనని పంజరం లో నుండి విడుదల చేస్తుంది… అపుడు ఆ రామ చిలుక ఎంతో సంతోషం తో ఎగిరి పోతుంది.. అది చూసిన రాణి సంతోషిస్తుంది…

ఇదంతా చాటు నుండి గమనించిన రాజు గారు అంతా విని రామ చిలుక మాటలను అర్దం చేసుకుని.. నా కుమార్తె ని కూడా నేను అలాగే బంధించాను కదా అని అనుకుని… తను నిజాన్ని గ్రహించి.. తన కుమార్తె దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు..

అమ్మా మా కంటి రెప్పలా చూసుకోవాలి అని నిన్ను నీ కలలకి దూరం చేసాము.. నీ మనసు ఎం కోరుకుంటుంది అనేది గ్రహించలేక పోయాము… నేడు మాకు అర్దం అయింది.. ఇక నుండి మీరు కూడా. ఆ పంజరం వీడిన రామ చిలుక వలె… నువ్వు కూడా సంతోషంగా ఉండవచ్చు.. నీకు నచ్చినట్లుగా.. ఎక్కడికి అయిన వెళ్ళవచ్చు అని హామీ ఇస్తాడు ఆ రాజు. ఆ యువరాణి చాలా సంతోషం తో ఎగిరి గంతేస్తుంది…

తను ఎంతో బాధతో ఏమి చూడలేక పోతున్న బయటి ప్రపంచాన్ని, ప్రకృతి అందాలను అని కుమిలిపోతూ ఉండే రాణి బయటి ప్రపంచాన్ని చూసి చాలా మురిసిపోతుంది… తన కల నెరవేరుతుంది….

– వనీత

బయట ప్రపంచం Previous post బయట ప్రపంచం
పల్లవి పలికించె చరణాలు Next post పల్లవి పలికించె చరణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *