యువత
ఓ యువత ఎందుకీ నిర్లక్ష్యం..
అందనిది ఏదైనా అందమే..
చెంత ఉన్నది ఎంత గొప్పదైన సరే చేదే..
లేని వాటికై అరువులు చాచి అలుసు అవ్వ కు..
నీ శక్తి ఎరిగి నీ చెంత ఉన్న సాధనాలతోనే నీదైన మార్గంలో అన్వేషించు నూతన అధ్యాయమే నీదవుతుంది..
అంతే తప్ప నిర్లక్ష్యపు వాకిట నిలిచిపోకు..
పద ముందుకు నిర్లక్ష్యాన్ని నిశిధికి అప్పగించి ఉషస్సులో నీవే వెలగాలి మరో రవింబమై…
ఈ జీవన పోరాటంలో సంకల్ప బలమే నీ ఆయుధమై ఆత్మవిశ్వాసమే నీ బలమై నిలుపుకొని సాగిపో విజయ దరహాసపు చిరునవ్వే నీ సొంతమవుతుంది…
-కళ