చిత్ర కవిత

పచ్చటి పొలం
ప్రకృతి కి అందం పెంచే
సొగసు పొలాల కున్నది
కళ్లకు ఆ అందాలను చూసే
నైజం ఉంది..
ఆ అందం చూసి ఆనందించే
లక్షణం మనసు కున్నది
ఎంత పచ్చటి అందమెా!
ఎంత ప్రకృతి బంధమెా!
ఆ పొలాలు వచ్చాక మన జీవన
విధానమే మారి పోయింది
జొన్నన్నం తినే రోజులే పోయాయి
తెల్లన్నం తినే రోజులు వచ్చాయి ( బియ్యం ) అందులోనూ లావు బియ్యం కూడా కాక సన్న బియ్యం తినే అలవాటు ఈ పచ్చటి పంట మనకిచ్చింది అవి తిన్నా ఒకప్పుడు బాగానే ఉన్నాం! కానీ మందులు కనుక్కున్నాడు కదా మనిషి తన తెలివి తేటలతో!
మన కొంప ముంచేసింది మందులతో పంటలు ఎక్కువ మంచిగానే వస్తున్నాయి కానీ అవి తిన్న మనకు రోగాలు ఎక్కువే అవు తున్నాయి..
జొన్నన్నం తిన్న శరీరాలు గట్టిగా ఉంటే సన్నన్నం తిన్న శరీరాలు వట్టి గానే మారాయి!!
ప్రకృతి ఎంత అందమైన పచ్చదనం ఇచ్చిందో అంత కన్న ఘోరమైన జబ్బుదనం ఇచ్చింది
ఏం చేస్తాం?
మందుల పంటకు అలవాటు పడ్డాక వేరేవి తినలేక పోతున్నాం!

ఇక ఎంత కాలం బ్రతికితే అంత కాలమే!!


ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన.