నా లాంటి ఒకడు
నాలాంటి ఒకడు ఉంటే
నాలాగే ఉండాలని కోరుకుంటా
ఎందుకంటే..
నేను చేసే పని నాకే నచ్చుతుంది
ఎదుటి వారికి నచ్చాలని లేదుగా
నచ్చినా నచ్చిందని చెప్పరు ఇగో
అడ్డు వస్తుంది
నాలాంటి వారే గనుక ఉంటే
నాలాగే ఉండమని చెప్తా!
నాకు నచ్చిన పనులు చేయమంటా!
నాలాంటి రోబో ను నేనే తయారుచేస్తా!
ఏమెా ఇంతకీ నేను చేసిన రోబో
నా మాట వింటుందా?
ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరూ
వినడం లేదు..
అంత అధృష్టమా? నా లాంటి ఒకడుంటే నా మాట వినాలను కోవడం అత్యాశైతే కాదేమెా!!
నేను అలా కోరుకోవడంలో తప్పు లేదేమెా!!
ఉమాదేవి ఎర్రం
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!!
సమాజంలో పోలీసులపాత్ర
పోలీసులంటేనే రక్షక భటులు ప్రజలను రక్షించే వారని అర్థం సమాజంలో మంచి చేసేవారు సమాజానికి రక్షణనిచ్చే వారు ప్రజల బాధలను న్యాయ సమ్మతంగా తీర్పునిచ్చేవారు కానీ
అలా ఎంత మంది పోలీసులుంటున్నారు? లంచాలు తీసుకుని వారి వైపు న్యాయం లేకపోయినా వారినే సమర్థిస్తున్నారు డబ్బుంటే చాలు
ఎవరెంత ఎక్కువ డబ్బిస్తే వారిదే న్యాయం అంటున్నారు సామాన్య మానవులు పోలీసు స్టేషనుకు వెళ్లాలంటేనే భయపడి పోతున్నారు ఇలాంటి పోలీసు శాఖ ఉంటే ప్రజలకు నరకమే!
ఏ తప్పూ చేయక పోయినా డబ్బులు ఇచ్చి కేసు పెడ్తే తీసుకుంటున్నారు న్యాయాన్యాయాలను చూడడం లేదు కానీ ఎక్కడో ఒక చోట మంచి పోలీసులు కూడా ఉన్నారు అందుకే ఇంకా ఈ లోకం ఇలా నడుస్తుంది..
ఉమాదేవి ఎర్రం.
ఇది నా స్వంత రచన.
కార్తీక దీపం
శివ కేశవులు ఒక్కటై భూమి మీదకు వచ్చు శుభదినం కార్తీక పున్నమి రోజు ఈ రోజు దీపాన్ని వెలుగిస్తే ఎన్ని పాపాలు చేసినా పోతాయని అంటారు పుణ్యం వస్తుందని కూడా చెప్తారు అంత మంచి రోజు కార్తీక పౌర్ణమి రోజు..
ఈ మాసమంతా మంచిరోజులే అయినా ఈ రోజు మాత్రం ఇంకా మంచిది వ్రతాలు చేసుకున్నా వత్తులు కాల్చుకున్నా ఎంతో పుణ్యం వస్తుందట.
మేమైతే చిన్నప్పుడు ధర్మపురికి వెళ్లేవాల్లం మా అమ్మ అక్కడ గంగలో స్నానం చేసి వత్తులు ముట్టించి వదిలేది మా వీధి నుండి కృష్ణారెడ్డి మామయ్య బస్సు తీసేవారు ఆ బస్సులో మా వీధి లోని ఆంటీలు మా అమ్మ,అక్క అందరం వెళ్లే వాల్లం
మా అమ్మ ఉసిరిక స్నానం చేయించి గంగలో ముంచేది నేను వణుకుతూ మునిగేదాన్ని మరి అప్పుడు నేను చిన్న పిల్లను ప్రతి సంవత్సరం అలాగే వెళ్లేవాల్లం శివరాత్రికేమెా వేముల వాడకు అదే బస్సు అదే మందిమి భలే బాగుండేవా రోజులు..
కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తులు కాలిస్తే రోజూ దీపం పెట్టిన పుణ్యం వస్తుందట..అందరూ కాల్చుకోండి మరి..
ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన..
Venkata Bhanu prasad Chalasani
Delete Comment
Are you sure that you want to delete this comment ?