సాగాలి కడవరకూ

నడక ఆగనట్టే పోరాటం ఆగదు
ఆరాటం తీరదు
భుజాన ఆశల బరువు
కరువుతో ఉన్న కంబోడియాలా నీరసంగా ఉంటుంది అప్పుడప్పుడు

నీడను చూసి మురిసిపోతుంటావు
తోడొకరుండిన అన్నట్లు ఉందని
రాత్రి విరిసిన కలలా
నిన్న కురిసిన వర్షంలా, దానిది అల్పాయుష్షు

నీవేమిటో నీకే తెలిసినవేళ
ఒంటరి చూపులేల
పయనమో పరుగో వెనక్కి చూడకు
గమ్యం చేరలేనేమోనని చతికిలపడకు

సి.యస్.రాంబాబు
7/07/25