వెన్నెల వసంతాల పౌర్ణమి రేయి,,,,!!
నీలి నీలి ఆకాశం సముద్రం వెలుతురు బొట్టు పౌర్ణమి చంద్రుడు,,,,,,
కడలి ఎగిసిపడే కెరటాల కౌగిలి విప్పి నింగిలోని పౌర్ణమి చంద్రుని తన్మయత్వంలో ఓలలాడుతూ,,,,,,,,,
కైపెక్కిన కడలి తరంగాలు జోరుగా ఊగిపోతూ ఉబికి ఉబికిపడుతూ,,,,,,,,
మబ్బుతునకంటూ లేని వినీలాకాశం నిండా వెన్నెల వసంతాలు పూసేను,,,,,,,,,
దివి నుండి భువికి వెన్నెల మల్లెల పూవులు రువ్వుతూ పసందైన పున్నమి రేయి సుందర వదని,,,,,,,
నీలి నీలి ఆకాశంలో తార చంద్రులు తప్ప పౌర్ణమి రేయి నక్షత్రాలన్నీ దోబూచులాడుతూ మాయమయ్యాయి,,,,,,,,,
పౌర్ణమి రేయి అప్సరసలు తారాచంద్రుల సయ్యాటలు దొంగతనంగా గాంచుతూ ముసిముసి నగవులు బోతున్నారు,,,,,,,,
అవనిపై కొత్త జంటలు వెన్నెల వర్షంలో నులివెచ్చని తమకంలో స్వేదంతో తడిసిముద్దవుతూ చల్లని గాలికి కులుకు లొలకబోస్తూ చెలియ జానతనం మైమరపించు,,,,,,,,
ప్రియుడు గొప్పలుబోతూ నేను జాబిలి కోణలో జామురాత్రి ఏ ఇంతితో నిదురించని యవ్వనం నాది ప్రియురాల రావేల అంటూ రాగాలుబోయే రేయి పున్నమి రేయి,,,,,,,
కొండ కోన రాయి రప్ప అంతా వెన్నెల పూలమాలల్లే మార్మిక మగువల మన్మథ పౌర్ణమి రేయి,,,,,,,,,
-అపరాజిత్
సూర్యాపేట
