అక్షరలిపి కవి కళా పీఠం
సాహితీ కవితలు
పేరు : కాకర్ల రమణయ్య
ఊరు : గుడిపాటిపల్లి
తేదీ:   09 -07-2025
చరవాణి : 9989134834
అంశం : చిత్ర కవిత
శీర్షిక : జీవన చిత్రం
కవిత:21

నవ్వుల  మోము వెనుక ఇంటి చూరుకు వేలాడుతున్న విషాదాలెన్నో..

విచ్చుకున్న కనులలో
కనిపించని కన్నీటి జాడలెన్నో

ముక్కును ముద్దిడిన 
ఎరుపు రంగులో
నలుపు రంగు చీకటిలెన్నో..

హృదయంలో ఉప్పొంగే భావాలను
లావాలా పెల్లుబికే  ఆలోచనలు ఇనుపపాదంతో తొక్కి పెట్టి  బ్రతుకు చిరుగులను గుర్తు చేసే చిత్రాలెన్నో

ప్రేక్షకుల నవ్వులలో జీవితాన్ని ఏరుకునే పేకలో జోకర్
మొహానికి వేసుకున్న రంగులల్లో
లోకం తీరును కాంచే మేకర్

నాటక రంగంలో సాటిలేని మేటి
బ్రతుకు సమరంలో నిస్సహాయ మావటి...

నవ్వుల పువ్వులు పూయించిన
రోజే నాలుగు వ్రేళ్ళు నోటినిముద్దాడుతాయి..

రంగు వంటిని తాకిన రోజే
ఏక్ దిన్ కా సుల్తాన్ ..

అర్ధ ఆకలుల అరణ్య రోదనలెన్నో
ఒంటికి గుడ్డకు అవస్థలెన్నో
పిల్లల చదువుల ప్రాణాళికలెన్నో
వెక్కిరిస్తాయి సమస్యలెన్నో

ఆత్మస్థైర్యంతో సాగిపోవాలి
పొదుపు మంత్రంతో నెగ్గుకు రావాలి...


హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ