ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం.
శీర్షిక
ప్రేమ బంధం
ఎన్నటికీ వీడలేనిది
నిజమైన ప్రేమబంధం.
అపురూపమైనది
అనురాగ బంధం.
ప్రేమ గుడ్డిది అంటారు.
ఆ మాట నిజమేనేమో.
ప్రేమలో పడితే చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని
ఏమాత్రం గమనించరు.
తమ ప్రేమ లోకంలో
తాము విహరిస్తారు.
ప్రేమికులను పిచ్చి
వాళ్ళు అంటోంది వారి
చుట్టూ ఉన్న ప్రపంచం.
ఆ మాట నిజమేనేమో.
ప్రేమ విఫలం అయ్యాక
పిచ్చివాళ్ళే అయ్యారు
ఎందరో ప్రేమికులు.
భగ్న ప్రేమికుడికి ఈ
ప్రపంచమే ఒక నరకం.
ప్రేమించుకుని ఆ తర్వాత విడిపోయిన వారి సంఖ్యే ఎక్కువ.
ఆ భగ్న ప్రేమికుల
మనస్సులెన్నెన్ని ముక్కలైపోయాయో.
వారి కంట రుధిరం
కారుతోంది చూడు.
ప్రేమ పేరుతో మోసం
చేస్తూ పోతున్నారు
కొందరు రాక్షసులు.
ఆ వలలో చిక్కుకుని
వగచే అభాగ్యులెందరో.
కాలమే వారి గాయాల్ని
మాన్పుతుందేమో.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని