ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం
శీర్షిక
అమ్మ తోడు
అమ్మ తోడుంటే మనం
ఈ లోకాన్నే గెలవగలం.
ఆమె ఆశీస్సులే మనకు
దేవతలిచ్చే దీవెనలు.
అమ్మా అనే పిలుపులో
అనురాగం దాగి ఉంది.
స్వార్ధపరులున్న లోకంలో
నీకు తోడుండేది అమ్మే.
బిడ్డల కోసం అహర్నిశలు
కష్టపడుతూనే ఉంటుంది.
తాను కష్టాలను భరించి,
పిల్లల క్షేమం కోరుతుంది.
నవమాసాలు మోసి,
కని పెంచిన అమ్మకంటే
మించిన దైవం ఉండదు.
ఆమె తోడు మనకు
ధైర్యాన్ని అందిస్తుంది.
నీకోసం జీవించే ఆ
తల్లిని ఆదరించు.
ఆమె మనసు గుర్తెరిగి
నువ్వు ప్రేమగా మసలుకో.
చేతకానివాడు అని లోకం
నిన్ను హేళన చేస్తున్నా,
అమ్మకు మాత్రం నువ్వే
రారాజువి అని గుర్తించు.
లోకంలో ఉన్న వారంతా
ఎవరో అమ్మ కన్న బిడ్డలే.
తెలివిలేని వాడివని దిగులు పడకు నేస్తమా.
కల్లాకపటం లేని జీవితమే
ఉత్తమమైన జీవితం.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని