కార్తీక దీపం
శివ కేశవులు ఒక్కటై భూమి మీదకు వచ్చు శుభదినం కార్తీక పున్నమి రోజు ఈ రోజు దీపాన్ని వెలుగిస్తే ఎన్ని పాపాలు చేసినా పోతాయని అంటారు పుణ్యం వస్తుందని కూడా చెప్తారు అంత మంచి రోజు కార్తీక పౌర్ణమి రోజు..
ఈ మాసమంతా మంచిరోజులే అయినా ఈ రోజు మాత్రం ఇంకా మంచిది వ్రతాలు చేసుకున్నా వత్తులు కాల్చుకున్నా ఎంతో పుణ్యం వస్తుందట.
మేమైతే చిన్నప్పుడు ధర్మపురికి వెళ్లేవాల్లం మా అమ్మ అక్కడ గంగలో స్నానం చేసి వత్తులు ముట్టించి వదిలేది మా వీధి నుండి కృష్ణారెడ్డి మామయ్య బస్సు తీసేవారు ఆ బస్సులో మా వీధి లోని ఆంటీలు మా అమ్మ,అక్క అందరం వెళ్లే వాల్లం
మా అమ్మ ఉసిరిక స్నానం చేయించి గంగలో ముంచేది నేను వణుకుతూ మునిగేదాన్ని మరి అప్పుడు నేను చిన్న పిల్లను ప్రతి సంవత్సరం అలాగే వెళ్లేవాల్లం శివరాత్రికేమెా వేముల వాడకు అదే బస్సు అదే మందిమి భలే బాగుండేవా రోజులు..
కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తులు కాలిస్తే రోజూ దీపం పెట్టిన పుణ్యం వస్తుందట..అందరూ కాల్చుకోండి మరి..
ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన..