ఈ రోజు అంశం..
ఈ రోజుల్లో పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి


అవును నిజమే! పిల్లలను కనడానికే సగం ఆస్తులు పోతుంటే ఇక చదివించడానికి మెుత్తం ఆస్తులు కరిగించడమే!
అందుకే పిల్లలను కనడానికే భయ పడుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు ఉధ్యోగాలు చేసినా పూర్వీకుల ఆస్తులను అమ్మాల్సిన పరిస్థితే! కొంచం మంచి స్కూల్లో వేయాలంటే లక్షల్లో ఫీజులు అన్నీ వారి స్కూల్లోనే కొనాలి ఎంత డబ్బంటే అంత పెట్టి అసలు చదువును కొనుక్కోవడం ఎంత విడ్డూరం!
ఒకప్పుడు చదువుకోమంటే బలవంతంగా పిల్లలను పట్టుకుని స్కూల్లోకి పంపి చదివించే వాల్లు ఇప్పుడేమెా పిల్లలు ఇష్టంగా చదువుకుంటామంటే ఈ డబ్బుల బాధ ఎలా మారి పోయిందో ఈ కాలం?
ఏం చేస్తాం? అయినా తప్పదు కదా!

-ఉమాదేవి ఎర్రం
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!