తలపుల తలరాతలు,,,,,!

కలల మది కన్నీరయిన పున్నమి వేళ
ఎక్కడో ఊరు చివరి వీదిలో కుక్కల అరుపులు
పూలన్నీ రాల్చిన తెల్లని మల్లెపూల పందిరి
చదువుకు దూరంగా అల్లరి చేస్తూ ఆటలాడే పిల్లలు
కాలంచెల్లి ఫలాలివ్వని జామ చెట్టు
కృత్రిమ ఎరువులతో పెరిగిన పరిమళా లివ్వని పూల మొక్కలు
ముఖాలు గులాబీల్లా విరిసినా మనుషుల మనస్సులు పాషాణం!
వాడిపోయిన పూవుల్లా నిరుపేదల అభాగ్యుల ముఖాల దైన్యము
గడ్డిపరకలు పచ్చదనాల తివాచీలా అల్లుకుని ఆహ్వానిస్తూ
మందు బుడ్లు,సిగరెట్ పీకలు వేయవద్దంటూ అభ్యర్థిస్తూ,,,,,,!
చిరిగిపోయిన దుస్తుల్లోని మహిళ కంకాళాలు మెడలో వేసుకుని నృత్యం
పార్కు చివరలో ట్యూబు లైటు కింద చదువులో నిమగ్నమయిన యువకుడు !
కురిసే వెన్నెల్లో ఝడిపిస్తున్న చలి రాత్రి
హోటల్ పక్కన దొరికిన ఎముకను కొరుకుతూ ఓ కుక్క
టి వి ల వద్ద పగలనకా రాత్రనకా గడిపే నడివయస్సు వృద్దులు
చలికి పక్షులు గగనంలో గుంపులు గుంపులుగా వలసపోతూ ఈ రాత్రి!
విరిసీ విరియని మొగ్గలు అనాధ పసిపిల్లలు ఆకలికి ముడుచుకు పడుకున్న వైనం!
తోపుడు బండి దగ్గర హాట్ కేకుల్లా తింటున్న బజ్జీలు పానీపూరీలు
ఈ తలపుల తలరాతలను మార్చేవాడేడీ!?!

-అపరాజిత్
సూర్యాపేట