నేనెవరు??

అవును నేనెవరు?
నా శరీరమా నేను?
నా హృదయమా నేను?
నా మనస్సా నేను?
మరి నేనెవరు?
రివ్వున ఎగిసే ఆలోచనలు
మనిషిని మనిషి గా
బ్రతకకుండా చేస్తున్నాయి!
మనిషివన్న జ్ఞానం ఉందా అసలు?
ముప్పూటలా మేయటమేనా జీవితం?
అడవి పూచిన పూచిన పూవులావిరిసి రాలిపోతే
నీవన్నవాడు ఒకడున్నాడని ఎలా తెలుస్తుంది?
నేనైనా నీవైనా ఆకాశంలొ ఎగిరే పక్షుల్లా
జీవితంలో అలవిగాని ఆనందం అనుభవించాలి
నేనెవరు? అంటే
నన్ను నేను ఆవిష్కరించు కోవడమా?
లోకులు చెప్పే కాకి కబుర్లా నేను?
గతం తాలూకు పరుచుకున్న చీకట్లా
నేను?
నన్ను నన్నుగా చూడని లోకాన్ని
ఏమంటే ఏముందిలే?అని సరిపెట్టుకోవాలా
ఇంతకు నేనెవరు?
ఈదులాడే కష్టాల బ్రతుకుకు
చదువుకున్న అక్షరాలు నేర్పించవాయె
నేనెవరని
జీవితానుభవాలేవీ నన్ను నేనుగా బ్రతకనీయవాయె
స్నేహితులు,కుటుంబ సభ్యులు నన్ను వాడుకోవడమే గాని
నేనెవరో తెలియకుండా నిలువెళ్లా
తమ పేర్లు లిఖించుకున్నారు
నేను అనబడే వాడి ఆనవాళ్ళు కూడా లేవు
ఒకవేళ నీకు తెలుసా నేనెవరో???

-అపరాజిత్
సూర్యాపేట