సంఘర్షణ ఎనిమిదో భాగం.

పెళ్లి అయ్యి భోజనాలు కూడా అయ్యాక , అప్పగింతలు మొదలు పెట్టారు. అప్పగింతలు అప్పుడు కరుణ తండ్రి ఒరేయ్ నేను నా కూతుర్ని చాలా గారంగా పెంచాను. ఒక్కగానొక్క కూతురు కాబట్టి తనదైన తప్పు చేసిన మీరే తల్లిదండ్రులుగా కాస్త మందలించండి అంతే తప్ప గట్టిగా మాట్లాడితే ఏడుస్తుంది రా అంటే చెప్పాడు. అరేయ్ నీకు తను కూతురేమో నాకు కోడలైనా కూతురైనా తనే తనను నిన్ను నాకు అన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటాను. మా వాడి కన్నా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం దిగులుపడకు నీ ఇల్లు ,నా ఇల్లు ఒకటి కాదు, నా ఇంట్లో తను చాలా సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉండు అన్నాడు.

ఇంతలో అనిత అన్నయ్యగారు ఆ కార్యం కూడా ఇక్కడే జరిపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం అని అంది. దానికి అరుణ్ తండ్రి నవ్వుతూ ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు రా ఇక్కడే ఈ పల్లెటూరులో ఉంటే, ఇలాంటి తరం ఒప్పుకుంటుందా? అందుకే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ కొన్నాను, రేపు పొద్దున్నే గృహప్రవేశం మీరు కూడా వచ్చేయండి. గృహప్రవేశం అవ్వగానే ఆ రాత్రి వాళ్ళకి మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేశాను. వాళ్లు మా ఇంట్లో ఉండరు. వాళ్ళు సపరేటుగా సంతోషంగా కొన్నాళ్లు ఉండనిద్దాం. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని అన్నారు అరుణ్ నాన్నగారు.

రేయ్ నీ బుర్రె బుర్ర ఎంత మంచి మాట చెప్పావు. ఇలాంటి ఆలోచన మాకు అసలే రాలేదు. నిజమే వాళ్ళు ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. తప్పకుండా వస్తాను రా ఇప్పుడే బయలుదేరుతా అన్నారు అనిత వాళ్ళు.

అప్పగింతలయ్యాక బోడి అప్పగింతలు ఏంటి నాలుగు రోజులలో మళ్ళీ మీ కూతురు మీ ఇంటికి వస్తుంది. అంటూ అరుణ్ మనసులో అనుకుంటే, ఏంటో ఈ అప్పగింతలు మళ్లీ వచ్చే దానికి అవసరమా అనుకుంది కరుణ కూడా, ఇక అందరూ ప్రయాణమై వెళ్లారు అక్కడికి వెళ్లేసరికి అందరికీ భోజనాలు రెడీగా ఉండడంతో అందరూ భోజనాలు చేసి బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయారు.

కరుణ తల్లిదండ్రులు ఒక రూమ్ లో, అనిల్ అరుణ్ ఇద్దరూ ఒక రూమ్ లో మిగిలిన వాళ్ళందరూ తలోచోట సర్దుకుని పడుకున్నారు.

తెల్లారి జామున అందరూ గబగబా రెడీ అయి కొత్త ఇంటి గృహప్రవేశానికి వెళ్లారు నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో రెండో ఫ్లోర్ వీళ్లది చాలా బాగుంది. రెండు బెడ్ రూమ్ లో హాలు కిచెన్ బాల్కనీ వ్యూ చాలా బాగుంది.

అందరూ ఆ ఇంటిని మెచ్చుకున్నారు, ఇక కొత్త దంపతులతో పాలు పొంగించి పాయసం వండించి, అందరికీ పెట్టించారు. ఆరోజు భోజనాలు కూడా క్యాటరింగ్ వాళ్లకి ఇచ్చారు. అందరూ భోజనాలు చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు. ఇక కరుణ తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోతూ కరుణ జాగ్రత్త అమ్మ మా కన్నా మీ అత్త మామలు చాలా మంచివారు. వాళ్లకి మాట రానివ్వకు అలాగే నీ భర్త కూడా చాలా మంచివాడు, అతని బాగా చూసుకో అంటూ జాగ్రత్తలు చెప్పారు.

వాళ్లతో పాటే అరుణ్ తల్లిదండ్రులు కూడా వెళ్తూ అరే మేము కూడా వెళ్తాము రా ఇంట్లో సామానంత రెడీగా ఉంది. మీరేం తెచ్చుకోనక్కర్లేదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒకర్నొకరు బాగా అర్థం చేసుకోండి.

అని అరుణ్ సపరేట్ గా పిలిచి ఒరేయ్ పిచ్చి ,పిచ్చి వేషాలు వేయకు ఆ అమ్మాయి ముందు చాలా జాగ్రత్తగా ఉండు భార్యాభర్తలు అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి, తనని కంటనీరు రానివ్వకు అని చెప్పాడు.

మీరు వదిలేసి వెళ్ళండి, కంటనీరా చుక్కలు చూపిస్తా ఇక అనుకున్నాడు మనసులో అరుణ్.

అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, అప్పటికి సాయంత్రం అయ్యింది. వాళ్ళందరూ ఉన్నప్పుడే ఒక బెడ్ రూమ్ ను మంచి డెకరేట్ చేశారు వాళ్ళ ఫస్ట్ నైట్ కోసం మల్లెపూలు గులాబీలతో హృదయాకారంలో పువ్వులన్ని పరిచి కట్టారు పళ్ళు పూలు అన్ని సర్దిపెట్టారు.

వాళ్లు వెళ్లకముందే తల్లి కరుణ ని పిలుచుకొని అబ్బాయికి అన్ని విధాలా సహకరించు. మొదటి రాత్రి అంటే జీవితంలో మర్చిపోలేని రాత్రి కాబట్టి చాలా సంతోషంగా ఉండండి అంటూ చెప్పింది. సరే అమ్మ అందికరణ. మనసులో మాత్రం నా టేస్టే వేరు అని అనుకుంది మనసు లో...

అప్పటివరకు ఎంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అరుణ్, కరుణ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అరుణ్ అనిల్ ని ఎంత ఉండమని అడిగినా కూడా ఒరేయ్ మీ ఫస్ట్ నైట్ కు నేనెందుకు రా అంటూ వాడు అందరికన్నా ముందే వెళ్లిపోయాడు. అలా ఒకరినొకరు చూసుకున్న తర్వాత అరుణ్ కరణ ముందే మరొక బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

అది చూసి కరుణ బిత్తర పోయింది. ఏంటి వీడు ఏదో చేస్తాడు మనం వేరే రకంగా చెప్పొచ్చు అనుకుంటే వీడేమీ చేయడం లేదు వెళ్లి పడుకున్నాడు అయినా నాకెందుకులే అని అనుకుంటూ తాను కూడా వెళ్లి అలంకరించిన బెడ్ రూమ్లో పడుకుంది తలుపులు వేసుకుని.

అలా ఆరోజు మొదటి రాత్రి ఏమీ లేకుండానే గడిచిపోయింది. తెల్లారి పొద్దున అనిల్ వచ్చి తలుపు తట్టే వరకు అరుణ్ కి మెలకువ రాలేదు. కరుణ కూడా లేవలేదు. అనిల్ వచ్చి ఆ తర్వాత ఏం జరిగింది రా అంటూ ఆరా తీశాడు..

వాడి నెత్తి మీద ఒకటి ఇచ్చి ఏమి జరిగింది అంటూ ఆరాలు ఒకటి ఉండమని అంటే ఉండకుండా వెళ్ళావు. అసలు నువ్వు ఏదో ప్లాన్ చెప్తా అని చెప్పకుండా వెళ్ళావు. అయినా దానికెంత పొగరు రా , ఇప్పటి వరకు కూడా ఇంకా లేవలేదు, కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా ఇంకెలా నిద్ర పోతుందో అన్నాడు అరుణ్ ..

ఇంతలో కరుణ బెడ్ రూం లో ఫోన్ మోగింది, మత్తులో ఉన్న కరుణ ఫోన్ తీసి హల్లో అనగానే ఒసేయ్ ఇంకా పడుకునే ఉన్నావా , తొందరగా లేచి అతనికి కాఫీ పెట్టీ తెలుగింటి పెళ్ళాం లా ప్రవర్తించు. ముందు తర్వాత విషయం నేను చెప్తా అంటూ స్నేహితురాలు చెప్పడంతో కరుణ నిద్ర మత్తు వడిలిపోయి నిమిషాల్లో బాత్రూం లో దూరి అన్ని కానుచ్చేసుకుని, మెల్లిగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది.

అక్కడ హల్లో అరుణ్ అనిల్ ఉండడం తో హాయ్ అన్నయ్య మీరెప్పుడు వచ్చారు. పొద్దుటే లేచాను .కాకపోతే అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు లే అని. లోపల ఉన్నాను అంది. అంత ఫ్రెష్
గా వచ్చేసరికి అలా మాట్లాడేసరికి ఇద్దరు బిత్తర పోయారు.

ఏంటి అన్నయ్య కాఫీ ఇమ్మంటారా, మాట్లాడడం లేదేం అంటూ వయ్యారంగా నడుస్తూ కిచెన్ లోకి వెళ్ళింది కరుణ .

ఓర్ని లేవలేదు అంటావెంటి రా , లేచింది స్నానం కూడా చేసినట్టు ఉంది అన్నాడు అనిల్. అరేయ్ ఇప్పుడే చూసారా నేను తను నిద్రపోతుంది. అన్నాడు అరుణ్ . ఓహో అయితే డ్రామా మొదలు పెట్టిందన్న మాట అన్నాడు అనిల్, డ్రామా ఏంట్రా అన్నాడు అరుణ్ అమాయంగా ,ఏముంది ఇలా చేసి నిన్ను బుట్టలో పడేయడానికి అన్నాడు అనిల్.

బుట్టలో పడేయడం ఏంటి ,పడేస్తే పడతానా నేను అన్నాడు బింకంగా, పడతావు రా ఎందుకు పడవు ,విశ్వామిత్రుడి అంతటి వాడే పడక తప్పలేదు. ఇక నువ్వెంత , పడడానికి అన్నాడు అనిల్, నోరు మూసుకో రా ఆలోచన చెప్తా అంటూ ఇప్పుడేమో నేను మరతాను అంటున్నావ్ అంటూ కోపంగా లేచాడు అరుణ్.

అగురా బాబు అగు , చెప్తాను ఇప్పుడే కదా అసలు సంగతి మొదలైంది అంటూ లేచి చూడు ఇక్కడ నుండి నీ ఆట మొదలు పెట్టు అన్నాడు అనిల్. ఏం చేయాలి ఏం ఆట అన్నాడు అరుణ్, ఇప్పుడు ఆమె ఏం చేసినా నీకు నచ్చలేదంటూ ఆమెని అవాయిడ్ చేయడం మొదలు పెట్టు దాంతో తానే తన పేరెంట్స్ తో చెప్పేస్తుంది, తనకు నాకు సెట్ కాదని అన్నాడు అనిల్.
ఓహో ఇంతేనా నేనింకా ఎదో అనుకున్నా , ఇక చూడు రెచ్చిపోతా అంటూ కాలర్ ఎగరేసాడు అరుణ్ .

ఏం ఆట ఆడతావో ఏమో నేనూ చూస్తాను, నాతో పాటూ అభిమానులు కూడా మనతో కలిసి చదువుతారుఅన్నాడు అనిల్ . మరి ఆ ఆటలు ఏమిటో ? అవేలా ఉంటాయో తదుపరి భాగం లో తెలుసుకుందాం...

- భవ్యచారు