నేటి అంశం
రాజకీయాల్లో నిజాయితీ ఎంత
శీర్షిక
రాజకీయం అంటే..
నేటి రాజకీయాల్లో నిజాయితీ
పాళ్ళు తక్కువనే చెప్పవచ్చు.
ప్రజల అభ్యున్నతి కోసం
రాజకీయాలు చేయటం
మానేసి సొంత లాభం
చూసుకునే రాజకీయ నాయకులే ఎక్కువమంది
ఉన్నారు. నేడు రాజకీయాల్లో
విలువలు ఉండటం లేదు.
పూర్వం ప్రజా సంక్షేమం
కోసం పనిచేసే రాజకీయ నాయకులే ఎక్కువమంది ఉండేవారు. ఏదో విధంగా
డబ్బు సంపాదించడం
ఆనవాయితీ అయ్యింది.
ప్రజలు కూడా అలాంటి
వారికే పట్టం కడుతున్నారు.
ఇదివరలో అవినీతి పరులైన
రాజకీయ నాయకులకు
ప్రజాదరణ ఉండేది కాదు.
ఇప్పుడు మాత్రం ఎన్ని సార్లు
జైలుకు వెళితే అంత గొప్పగా
చెప్పుకుంటూ ఉన్నారు.
అంత ప్రజాదరణ ఉంటోంది.
ఇప్పుడు మళ్ళీ పాత రోజులు
రావాలి. ఆనాటి విలువలు
మళ్ళీ పాటించబడాలని
నేటి ప్రజలు భావిస్తున్నారు.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని