ఈ రోజు అంశం
సమానత్వం

శీర్షిక
సమానత్వం ఆశించలేం

సమాజంలో సమానత్వం ఆశించలేం కానీ ఆ అసమానతలు తగ్గించే
ప్రయత్నం చెయ్యవచ్చు.
ఈ సమాజంలో ధనికులు
మరియు పేదల మధ్య
అసమానతలు ఉన్నాయి.
ధనం మూలం ఇదం జగత్
అనేది సత్యం. అయితే ధనం
సంపాదించడం అంత తేలిక
కాదు. దానికి కొంత మందికి
జీవితకాలం పడుతుంది.
పేదవారిని ఉన్నతస్థాయికి
తెచ్చేందుకు ప్రభుత్వం కూడా
తీవ్ర కృషి చేస్తుంది. పేదవారి
పిల్లలకు ఉచితంగా చదువు
చెప్పిస్తోంది. ప్రతిభ ఉన్న
వారికి ధనంతో సంబంధం లేకుండా ఉపకార వేతనాలు
కూడా ఇచ్చి ప్రోత్సాహం కూడా
ఇస్తోంది. పేదవారికి రేషన్ కార్డులు ఇచ్చి వారికి కావలసిన సరుకులు
సరసమైన ధరలకే
అందిస్తోంది. అంతే కాకుండా
పేదవారికి ఇళ్ళు కూడా
మంజూరు చేస్తోంది.
స్వయం ఉపాధి కల్పించే
ప్రయత్నం చేస్తోంది. ఇంత
చేసినా అనుకున్న స్ధాయిలో
అసమానతలు తగ్గటం లేదు.
అలా అని ధనికులపై విచక్షణా రహితంగా పన్నులు వేయమని ఎవరూ అడగటం
లేదు. పేదవారికి, మధ్య తరగతి ప్రజలకు కూడా
ధనికులతో సమానంగా
కాకపోయినా ఆ స్ధాయిలో
సౌకర్యాలు ఏర్పాటు చేసే
ప్రయత్నం చెయ్యాలి.
కష్టపడి పనిచేసే వారికి
తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
రైతులు పండించిన
పంటకు గిట్టుబాటు ధర
కల్పించాలి. వృద్ధుల
ఆరోగ్య సమస్యలకి
వారికి సరైన వైద్య
సౌకర్యాలు కల్పించాలి
అప్పుడు మాత్రమే
కొంత మార్పు జరిగి
అసమానతలు తగ్గి
సమాజం అభివృద్ధి
దిశగా ముందడుగు
వేస్తుంది.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని