అప్పులకుప్ప

రాత్రి కరిగిపోతుంది
ఉదయం వెలిగిపోతుంది
జీవితం మాత్రం తరిగిపోతుంటుంది

కాలం కరిగిపోతుంటుంది
జ్ఞాపకాలు మిగిలిపోతుంటాయి
పడమటి సంధ్యవాలిపోతుంటుంది

మనుషులు మృగాలవుతుంటారు
మంచితనం ఎండమావుతుంటుది
మనిషిలో చెమ్మ ఎండిపోతుంటుంది

నీడలు నిజాలు జమిలిగా వెంటాడుతుంటాయి
జీవిత సత్యాలన్నీ తీర్చలేని అప్పుల కుప్పలా తోస్తాయి... తీరికలేని మనుషుల
అసహనం కార్చిచ్చులా వ్యాపిస్తుంది



-సి.యస్.రాంబాబు

image