శరత్ వెన్నెల జాబిలి!
శరత్ కాలపు రాత్రులు
నిర్మలమైన ఆకాశంలా
లతలు లతలుగా అల్లుకున్న బంధాలు
హొయలొలుకు ఆనందానుభూతులు
ప్రశాంత సముద్రంలా ఆకాశం
మిల మిలలాడే చుక్కల్లో చంద్రుడు
చల్లని మలయమారుతాలు
వేదన సంవేదనలన్నీ పొంగి పొంగి సద్దుమణిగి
ఆ వెన్నెల రాత్రులు పాలు కుమ్మరిస్తున్నట్లు
తెల్లని పాలరాతి వెన్నెలలు!
దివినుంచి భువికి తొంగిచూసే దేవతల్లా
ఆ నక్షత్రాల వెలుగులు
మంచు ముత్యాలు కళ్ళల్లోంచి
తొంగిచూస్తున్నట్లు ఆనందాల శరత్ కాలం రాత్రి
స్టౌపై పొంగుతున్న వేడి వేడి పాలు
బ్రతుకు సంద్రం అలల తాకిడికి
కొండల బండలు వెన్నెలలో మల్లెలు పూచినట్లు!
వేగుచుక్క పొడిచి మీగడ తరగల్లా
ఆనందాలు నీ ముసి ముసి నవ్వుల్లొ తొణికిసలాడినట్లు
జాబిలి వసంతం శరత్ రాత్రులు
కన్నెగులాబీలు విరిసి మాలలై నీ జడనిండా విరిసి
ఆకాంక్షలు తీరాలు దాటి హరివిల్లులై
మనస్సున మల్లెపూల పరిమళాలు
ప్రేయసితో వెన్నెల జలకాల హొయలు!
-అపరాజిత్
సూర్యాపేట