కాలానికి ఎదురీదితేనే జీవం ఉనికి,,,,!!

చుట్టూ అలల సముద్రం జీవానికి పనికిరాని ఉప్పనీరు
ఎవరో మహానుభావుడు తీరాన్నే ఎత్తైన బండపై నాటిన పెనుసవాళ్ల పెనుగాయాల తాకిడి తట్టుకుని నిలిచి బండబారిన చిన్న వృక్షం,,,,,,,
చూపరుల కళ్ళు అచ్చెరువొందేలా అల్పపీడనాలు తుఫానులలో ఎగిసిపడుతూ అతి వేగంగా వీచే గాలులతో ముంచెత్తే కెరటాల హోరు సముద్రంలో సుడిగుండాలు సునామీలను తట్టుకుని తనదైన శైలిలో జీవిస్తూ జనం హృదయాలలో జీవితంపై తీపి ఉపిరులూదుతున్న చెట్టు ఓ సందేశం ఇస్తోంది,,,,,,
నిజంగా నీవు అపజయాల పాలై అవమానాలు ఆక్రందనలే జీవితమైతే కృంగి కృశించి జీవితాన్ని నరకతుల్యం చేసుకుని అభాసుపాలై బ్రతుకు చాలించడమే జీవితమా,,,,,
ఎన్ని సవాళ్ళు ఆటుపోట్ల మధ్య బ్రతుకులు బండలవుతున్నా ఉన్నచోటి నుండి ఉద్యమంలా చెలరేగిపోయి పిడికిలి బిగించి పోరాడి విజయ శిఖరాలపైకి ఎదిగి నీవేంటో నిరూపించుకో,,,,చావు పరిష్కారం కాదు సుమీ,,,,,,
అవును అందరూ పెద్ద పెద్ద కీర్తి మంతులు కాలేరు కదా,,,, నీకున్న పరిధిలోనే దిగ్విజయాలు సొంతం చేసుకో సానబెట్టనిదే వజ్రం ఆవిర్భవించదు కదా మిత్రమా,,,,,,,!!




-అపరాజిత్
సూర్యాపేట

image