అక్షర లిపి కవిత సమూహం
అంశం : నీలాగే నేనుంటే
రచన : యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం

ఓ దైవమా నీ దయ అపురం
నీ కరుణ దయా ప్రపూర్ణం

నిన్ను వలె నీ తోటి వారిని ప్రేమించు
నిరుపేదలకు సాయంబు చేయు

అన్న దయాగుణం గొప్పది
సర్వ జీవ పోషక అఖండం

ఉన్నదానితో సరిపెట్టుకో
లేని దానికోసం ప్రయాస పడకు

ప్రయాశపడుతున్న సమస్త జనులారా నా వద్దకు రండి
అని పలుకులు పలికిన ఓ ప్రభువా నీకు వందనం

నీలాంటి దయాగుణం మాకు కావాలి
నీలాంటి సహన గుణం మాకు రావాలి

నీలాంటి మంచితనం మాకు ఉండాలి
నీలాంటి కార్య దక్షత మాకు ఇవ్వాలి

దీనులను ఆదుకునే గుణం మాకు ఇవ్వు
నిన్ను పోలితే నేను నిజంగా మానవత్వం పోలిన మరో దైవాన్ని

నీలాగే నేనుంటే అద్భుతం
నీలాగే నేనుంటే అఖండ చరితం

సాధించగలను నిజమయ్య
నీలాగే నేనుంటే అయ్యెదను అవునయ్యా.

----------------------------------------