రేఖలలో సునిషిత భావణల రూపకల్పన చిత్రకళ,,,,,,,,!!

చిత్రకారుని లోతైనభావాల కుశాగ్రబుద్దికి రూపమే చిత్రకళ,,,,,,,,
ఒక కళాఖండం రూపుదిద్దుకోవాలంటే తన ఊహల సుడుల నుండి మర్మగర్భిత చిత్రీకరణచేసే మేధావి చిత్రకారుడు,,,,,,,,,
ఆలోచనలు రేకెత్తిస్తూ సునిషిత భావాలను చిత్రంలో చూపిస్తూ సౌందర్య పిపాసుకుల హృదయాలను తట్టిలేపడం బహుఅరుదైన సన్నివేశం,,,,,,,,,
చిత్రకారుడు అనూహ్యమైన సాధనలో సౌందర్య ఆరాధన ఒక భాగం చిత్రీకరణ మెళకువలు ఇవన్నీ అగుపించకుండా కేవలం తన హృదయంలో పూసిన సంక్లిష్ట దృశ్యాన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ సందేశాన్నివ్వడం సామాన్యం కాదు,,,,,,,,,,,
ఒక్కో బలమైన ఊహ చిత్రీకరణలోకి రావాలంటే దానికి మొదట సరైన స్కెచ్ వేసుకుని తన ఆలోచనలలోని రూపం తాత్వికతతో సాలోచనగా వచ్చే చిత్రం ఏకాగ్ర చిత్తంలోంచి ఉద్బవించిన చిత్రకారుని మనస్సు పూసిన కళ ,,,,,,,,,,,
చిత్రం ఒక మనస్సుల్లోకి బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్తూ వీక్షకులను చైతన్యంతో పాటు కార్యోన్ముఖులను చేస్తూ ఉద్యమించమని సందేశమిస్తూ కార్యోన్ముఖులను చేసే కళారూపం చిత్రకళ,,,,,,,,,,
అక్షరాల అవసరమే లేకుండా సన్నని గీతలతో జీవితంలోని శోభిళ్ళు క్షణాలను విషాదఛాయలను ప్రకృతి రమ్యతను మనకు తెలియకుండా హృదయం పాడే సన్నని తీయని రాగం మనస్సంతా అలుముకుని అలలనేవి లేని సరస్సులోని నీటి నిర్మలత్వం సుడిగుండాల మనస్సు తెలికవును. ఉద్యమించును కూడా సుమీ,,,,,,,,,,



-అపరాజిత్
సూర్యాపేట

image