ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం

శీర్షిక
అమ్మా నన్ను బ్రతికించు

నేనేమి పాపం చేసాను?
అమ్మా నీ కడుపులో ఉన్నా మీ మాటలు విన్నా.
ఆడపిల్ల అంటే కోపమేల?
దేవుడిచ్చిన జన్మ నాది.
నీ కడుపులోనే ఉన్నాను.
త్వరలోనే నే పుట్టేస్తాను.
నీకు ఆనందాన్ని పంచేస్తా.
పుట్టకముందే నాన్నకు
నా మీద కోపం వచ్చింది.
నన్ను తుంచేయకమ్మా.
నా పట్ల దయ చూపించు.
నీ ప్రేమను నాకు పంచు.
కల్లాకపటం తెలీదు నాకు.
నువ్వు గర్వపడేలా చేస్తా.
నీకు ప్రేమామృతం ఇస్తా.
అమ్మా నన్ను బ్రతికించు.


ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని