నీతో నువ్వు
కుదిపేసిన క్షణాల చిరునామా వెతుక్కుంటూ పోతే
నీ చిరునవ్వు ఏమవ్వాలి
తరలివెళ్ళిన మనుషుల
నీడలు వెతుకుతుంటే
నీకు నువు దొరుకుతావేమో కదా
జాలిలేని లోకం,కాలమని
చేసే నిందారోపణలు
కొత్త చివుళ్ళని మోసుకురాలేవుకదా
ఇక్కడ ఎవరూ కొత్త కాదు
అలాగాని ఎవరూ పాతకాదు
నీ బాధను,గాధను నువే మోయాలి
అపుడు కదా.. నీకు నీవు తెలియటం నుంచి
అర్థమయే స్థాయికి ఎదిగేది!
-సి.యస్.రాంబాబు
21/04/25
