శూన్యం లోంచి శూన్యం లోకి

శూన్యంలో శూన్యమై వీడిపోతున్న జ్ఞాపకాలు
ఉలిక్కిపడే ఊహల్లో గాలిమేడల పొగలు
కాంతులు కరిగిపోతూ జాడలేని గాలి కెరటాలు
జ్ఞాపకాల జ్ఞానాన్ని తిరగదోడినా అంతుచిక్కని జీవం రహస్యం
ఆనంతానంత కాలం వెనుక శూన్యం నుండి జీవం సృజన
ఊహల కందని దృగ్గోచర చిత్రం అమీబా నుండి అంచెలంచెలుగా మానవ మాత్రుడుగా మార్పుచెందడం,,,,,,,,,,,
ఈ సూర్యోదయాలు కాలాల మార్పులు బ్రతుకుపై జిజ్ఞాస రేపింది మానవునికి,,,,,,,,
ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్లు జోరువానలు ఉక్కిరిబిక్కిరి చేశాయి,,,,,,,,,,,
ఎండల మంటలు చెలరేగే వడగాలులు ఆలోచనల కందని ఉష్ణకాసారం,,,,,,,,,,,,,
చలితీవ్రత హిమం కురిసే పొగమంచు మబ్బులు గజగజ వనికే చలి తాకిడికి మంచుముద్దయి పోయే హిమం,,,,,,,,,,
క్రమేణా భౌగోళిక పరిస్థితులకు అలవాటు పడి జీవన విధానం కొనసాగుతోంది,,,,,,,,,,,,
మానవుడు తన తుదిపోరులో మౌనంగా కరోనా లాంటి వైరస్ లతో భూగోళం నుండి వెళ్లిపోవడమే,,,,,,,,,,,,,,
శూన్యం లోంచి వచ్చి శూన్యంలో కలిసిపోవడమే,,,,,,,,,,,
ఆకాశమంతా నిర్మలంగా ఏ అలికిడి లేని శూన్యమైన ఆఖరు క్షణాలు జీవం కోల్పోయి,,,,,,,,,,,


-అపరాజిత్
సూర్యాపేట

image