వీర వనితలు:

సింగారానికే బంగారం
స్వాభిమానపు సాహసం
వీర నారుల విజయదరహాసం

వీర వనితల పేర్లు చెబితే
సరిపోదు ఎన్ని పేజీల
పుస్తకం అయినా

మహిళ లోకాన్ని అబ్బురపరిచే
నాయకత్వానికే నాయకత్వం వీర వనితల సాహసం

దేశానికే దిశా నిర్దేశంగా
వారి త్యాగాలు నిదర్శనం

శౌర్య పరాక్రమాలను
సత్తా చాటుతూ శత్రు దేశాలకు జవాబు చెబుతూ
ప్రభంజనాన్ని సృష్టిస్తారు వీరవనితలు

ప్రతిఫలం లేని నిస్వార్థపు
అజేయ శక్తిగా నిలుస్తారు వీరవనితలు

ప్రాణాన్ని పణంగా పెట్టి
పోరాట శక్తిని నిరూపించి
గెలుపు సంచలనాలను సృష్టిస్తారు వీరవనితలే

చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన
విముక్తి సందేశాలిచ్చిన
దేశ ప్రతిష్ఠను నిలబెట్టేందుకు
వీర వనితల లక్ష్యమే

శక్తియుక్తుల సమ్మేళనంతో
శాయశక్తుల కృషితో
ధర్మ పోరాటంలో
విజేతలు వీరవనితలు

అబల కాదు సబల అని
విశ్వసించి నిరూపించి
స్ఫూర్తి నింపే వీర వనితలు

దేశభక్తి నిండుగా
సమాజ శ్రేయస్సు ముందుగా
అని సాగే మహిళా మణులు

ఎందరెందరో వీర వనితల
త్యాగనిరతి కనువిప్పు కావాలి ప్రజలందరికీ దేశభక్తి అంటే ఏమిటో అని

వీర వనితలకు దీరమాతలకు
వందనం అభివందనం...

-జి.జయ

image