వీర వనిత
కలిమిలో జన్మించినా కాంతియై నిలిచె
కరగని వజ్రము వంటి హృదయం దాచి
కర్మయోగ వేటలో కన్నీరు తోచలేదు
వేద వాక్య రహస్యాలనూ, వీర ధర్మ శాస్త్రల ను,
పలికిన వాణిలో పరాక్రమ మేళిమి
నిరంజన నైతికత, నిర్భయ నడక
నిత్య ధైర్యదీపిక ఆమె మనశ్శక్తి
వీర వనితల శిరోమణి ధీర వనిత
తలచిన ఘడియలో తలంపే తేజస్సు
తపస్వినిలా జ్వలించే తారక మంత్రం
రక్తపు రేఖలపై రాసిన సువర్ణ చరిత్ర,
ఓరిమి వైపు వంచనను నిశ్శబ్దంగా ఓడించిన చైతన్యం
సతీ ధర్మమా? శక్తి యాగమా?
సర్వమూ ఆమెలో సమపాళ్ల సారాంశం
జయ జయ వీర వనితా..!
ధీరతకు మూర్తిమత్వం నీవే..!
భారత భాగ్య లక్ష్మి రూపిణి నీవే...!
-శివరామ్ శంకర్ నాయుడు
