*ప్రపంచ పాల దినోత్సవం*


ప్రపంచ పాల దినోత్సవం ప్రతి ఏట జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటుచేయబడింది.

100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, టీనేజి పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డైరీలు వెలిశాయి. అయితే డైరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్‌ 1 నుండి ఫుడ్‌, అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు.

కల్తీ లేకుంటే పాలకు మించిన పోషకాహారం లేదు. కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలి. చిన్న, పెద్ద డైరీలు, సహకార సంఘాలు, నష్టాల బారిన పడకుండాను సహకరించాలి.

ప్రపంచ పాల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు - ఇది బిలియన్ల మందికి పోషణనిచ్చే కీలకమైన, అందుబాటులో ఉండే ఆహార వనరుగా పాలను హైలైట్ చేసే ఒక ఉద్యమం. పాలు ఎముకల ఆరోగ్యం, పెరుగుదల మరియు రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి, ఇది పిల్లలు మరియు పెద్దలు ఇద్దరికీ కీలకంగా మారుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1న జరుపుకునే ప్రపంచ పాల దినోత్సవం, స్థిరమైన వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధి మరియు ప్రపంచ ఆరోగ్యంపై పాడి రంగం ప్రభావాన్ని గుర్తించి, విస్తరించడానికి దేశాలు, సంస్థలు మరియు సంఘాలను ఏకం చేస్తుంది.

*మాధవి కాళ్ల*
*సేకరణ*

image