చిత్ర కవిత్వం

అల్లారు ముద్దుగా వెలసింది
ఆ ఇంట..
అపరంజి బొమ్మగా మురిసింది
పుట్టింట..
ఆడపిల్లే లక్ష్మీ దేవిగా కొలిచేరు
నట్టింట..
గోరు ముద్దలే తినిపించి ఆటలెన్నో నేర్పించి..
చదువుల సరస్వతి గా తీర్చి దిద్ది..
ల్యాపు టాపు లో పాఠాలన్ని
నాన్న గురువు గా భావించి
నేర్చేసిన చిన్నారి..
కాలేజీ చదువులన్ని అవలీల గ
చదివేసి..
ఉధ్యోగాలే చేసేసి పెళ్లీడు వచ్చిందని ఒక అయ్య చేతిలో
పెట్టేస్తే..
కన్న తండ్రినే మరిచి పోవాలని
ఆంక్షలెన్నో పెడతారు..
కన్నీటి ప్రపంచంలో బ్రతుకు
సాగదీస్తూ బ్రతకాలి!!
జీవిత మంతా కన్నీటి ధారలే!!
కానీ..
ఆడపిల్ల ధైర్యంగా సమాజంలో మెుదలాలి!
కన్న వారిని మరవకుండా తన లక్ష్యం సాధించాలి!!


ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన..