అక్షర లిపి సాహితీ వేదిక
సాహితీ కవితలు
పేరు : కాకర్ల రమణయ్య
ఊరు : గుడిపాటిపల్లి
తేదీ:10-06-2025
చరవాణి : 9989134834
అంశం : చిత్ర కవిత
శీర్షిక : ముదిమి వయసు
కవిత : 8

ఆశల వాకిలికి గోడను పెట్టి,
తలపుల తోటను బూడిదచేసి,

ఆత్మీయ లతలను నులిమేసి,
అహర్నిశలు శ్రమను
రూపాయిగా మార్చి,

ముదిమితో దిగాలు పడ్డ కళ్ళలో
నిశిరాత్రి నీడల జాడలు
జాలువారు తున్నాయి..!

జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం..!
గుప్పెడు మెతుకుల కోసం
బ్రతుకు రిక్షాను ఎముకల
చక్రాలతో, రక్తం ఇంధనంతో
లాగే మోడువారిన కన్నీళ్లు
అక్కడ వరదలా పారుతున్నాయి..!

జీవిత చక్రంలో,
కష్టాల కొలిమిలో కాలే విలువైన
లోహం తన దేహం..!

తాను అభిమానానికి తండ్రిగా,
ఆప్యాతలకు తాతగా
పదోన్నతి పొందినా,
కష్టానికి చిన్న తమ్ముడిగానే
మిగిలిన వైనం..!

జీవిత ఎదురీతలో
కష్టాల కన్నీళ్లు ఉంటాయి,
సుఖాల వెంపర్లాటలు ఉంటాయి..!

కష్టాలకు కృంగి పోక
సుఖాలకు పొంగి పోక
జీవితపయనాన్ని కొనసాగించడమే
జీవిత పరమార్ధం.!

నలుగురికి ఆదర్శమై..!
గుండెనిబ్బరాన్ని ఆయుధంగా
మలుచుకుని కల్లోలాను
కడతేర్చుకుంటూ ముందుకు
సాగిపోవడమే మానవ కర్తవ్యం..!

సమాప్తం:
హామీ పత్రం :

image