అక్షర లిపి .✍️
----------

తేదీ : 11 / 6 / 2025
పేరు : చుంచు సంతోష్ కుమార్
జిల్లా : సిద్దిపేట
సంఖ్య : 08
అంశం : చిత్ర కవిత
శీర్షిక : దయ చూపండి కాస్త మాపై .✍️
__________

అడుక్కొని తినే ఈ బ్రతుకుని
అడుక్కొని వచ్చానేమో ఆ విధాతని
లేక ఏ జన్మ పాపానికి కర్మ ఫలమో
ఈ జన్మకి ఈ అడుక్కునే దుస్థితి ..!!

ఆకలి అలమటింపులతో
సాయంకై సంచరిస్తున్న జీవితాన్ని
అంది అందని సాయంతో
తీరి తీరని ఆకలితో
కాలం గడుపుతున్న నిరుపేద జీవితాన్ని
దయచేసి నాకు సాయం చేయండి
మీ పిల్లా పాపలతో సంతోషంగా మీరుండాలని
ఆ దైవాన్ని వేడుకుంటున్నాను
కాస్త దయ చూపండి నాపై ..!!

జానెడు పొట్టకు పిడికెడు మెతుకుల కోసం
అలమటిస్తూ మా అడుగులు చేస్తాయి
ఎన్నో చోట్లకు ప్రయాణం
వాహనాల స్టేషన్లో జనం రాకపోకల దారుల్లో
వ్యాపార షాపుల చుట్టూ
మసీదు చర్చ్ మందిరాల ప్రాంతాలకు
దయ చూపండి మాపై కాస్త
మీ దానమే తీరుస్తుంది మా జీవిత గోస ..!!

అయిన వాళ్ళ ఆదరింపు లేక
ప్రభుత్వానికి మా బ్రతుకులు కానరాక
చేతిలోన చెల్లి గవ్వలేక ఏమిటో
మా ఈ దీన బ్రతుకులు
మీ లాంటోళ్లు దయతలిస్తే తప్ప
బ్రతకలేని మా బ్రతుకులు
దయ చూపండి మాపై కాస్త దానం చేయండి ..!!
__________ .✍️

{ హామీ పత్రం ఇది నా స్వీయ రచన }

image