ఈ రోజు యెాగినీ ఏకాదశి అని మా పెద్దమ్మాయి గుడి కి వెళ్దామంది అది నిన్ననే ఫ్రెండ్స్ తో వెళ్లి వచ్చింది
నాకే మెా నీరసంగా అని పించింది ఏమెా చూద్దాం లే!
అన్నాను .
అదీ కాక ఈ రోజు లంచ్ చేసే సరికి మూడయింది అది కూడా మూడింటికి స్టార్ట్ చేస్తే అయి పోయే సరికి నాలుగైంది..
ఈ మధ్య కాలం లోనే మా అక్కయ్య కొడుకు కోడలు వాడి బిడ్డ పెళ్లి కార్డు ఇవ్వ డానికి మా ఇంటికి వచ్చారు
ఎంగేజ్ మెంట్ అయిన దగ్గరి నుండి వాడి ఇంట్లో వడుగు ( అబ్బాయి ఇంట్లో ) అయినా మేము వెళ్లడమే! మళ్లీ పసుపు దంచడం దానికి కూడా వెళ్లాం
వాడికి మా అక్క కన్నా నేనంటేనే చాలా ఇష్టం మా అక్క స్కూల్ టీచరు దాంతో ఎప్పుడూ వాడిని మా అమ్మ దగ్గర నే ఉంచేది నేనప్పుడు చిన్న పిల్లనే కానీ
వాడిని ఆడించడం తినిపించడం చేసేదాన్ని .
అలా మాకు అనుబంధం ఎక్కువ.
వాడు నాకో మంచి చీర తీసుకుని పెళ్లి కార్డు తీసుకుని
వచ్చాడు మా కోడలు కూడా!
ఇద్దరూ నా ఒళ్లో చీర పెట్టి పెళ్లి కార్డు పెట్టి కాళ్లకు దండం పెట్టాడు నా కైతే కళ్లల్లో నీళ్లు వచ్చాయి మనం పెంచిన పిల్లలు ఇలా ప్రయెాజకులై మనలను గౌరవంగా
ప్రేమతో చూస్తుంటే ఎంత బాగని పిస్తుంది..
అయితే వాల్లు దేవుడి దగ్గర పెట్టిన కార్డులలో ముందు
మెుదటిది వారి వియ్యంకులకు ఇచ్చి రెండోది మాకే
తెచ్చారు పక్కనే ఉన్న పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి
వాల్ల మామయ్య కు మా అయిదుగురికి ఈ రోజు పంచారు..
నా కైతే చాలా సంతోషమైంది.
ఇంకోటేంటంటే మా మనవరాలు అదే పెళ్లి కూతురు నన్ను బుజ్జక్కా! అనే అంటుంది
నన్నందరూ అలాగే పిలుస్తారు ఇంకో అక్క పిల్లలు వాల్ల పిల్లలు కూడా ఈ పెళ్లి కూతురు చెల్లి కూడా!
ఫోటో పెట్టాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్..
ఇక వాల్లు వెళ్లాక మా అమ్మాయి గుడి కి వెళ్దామంది
గుడి విశేషాలు ఇంకో దాంట్లో రాస్తాను అందరూ చదవండి..
ఏ గుడికి వెళ్లామనే మీ డౌట్ కదా! కర్మన్ ఘాట్ అండి.