సస్పెన్స్ కధల పోటీకి కధ
శీర్షిక
గుడిలోని దేవుడు
మాయం అయ్యాడు.
ప్రతాప్ పట్టణంలోని ప్రభుత్వ హాస్టలులో చదువుకున్నాడు. అతనిది కడు పేద కుటుంబం. బాగా చదవటం వల్ల చదువు పూర్తి అయిన వెంటనే అతను పోలీస్ ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు . అదృష్టవశాత్తూ అతనికి తన స్వగ్రామమైన కానగూడెం దగ్గరే డ్యూటీ వేశారు. ఒక అటవీ ప్రాంతంలోని గూడెం ఆ కానగూడెం. అదంతా అటవీ ప్రాంతం. అక్కడి వారంతా పేదరికాన్ని
అనుభవిస్తూ ఉన్న వాళ్ళే. వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. పోడు వ్యవసాయం చేస్తారు. పోడు వ్యవసాయం అంటే ఒక సారి పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వ్యవసాయం చెయ్యరు. మరొక చోట చెట్లు కొట్టేసి వ్యవసాయం చేస్తారు. ప్రతాప్ తండ్రి
తన బిడ్డను పెద్ద చదువులు చదివించాలి అనే కోరిక ఉన్నా కూడా ఆర్ధిక స్తోమత లేక ఊరుకున్నాడు. అప్పుడు అక్కడ పాఠశాలలో ఉన్న టీచరు ప్రతాప్ కు చదువు పట్ల ఉన్న ఆసక్తి చూసి అతన్ని దగ్గరలోని ఒక
సర్కారు బడిలో చేర్చారు.
అక్కడే అతనికి రాజుతో స్నేహం కలిసింది. ఇప్పుడు ఆ చిన్ననాటి స్నేహితుడు రాజు కూడా అక్కడే గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ తన జీవితం గడుపుతూ ఉన్నాడని ప్రతాప్ కు తెలిసింది. వారిద్దరూ చిన్నప్పటి నుంచి విడదీయలేని మిత్రులు. రాజు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. రాజు అమాయకుడు. ఆ అమాయకత్వం వల్లనే రాజు నష్టపోయాడు. ఒక రోజు కానగూడెంలో చోరీ జరిగింది .రాత్రి గుడిలోని ప్రాచీనమైన విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. గ్రామస్తులందరూ ఒక చోట సమావేశం అయ్యారు. "ఇది దైవ అపచారం, తక్షణమే దొంగను పట్టుకోవాలి. పదండి పోలీసు కంప్లైంట్
ఇద్దాం." అని వారంతా కలిసి తీర్మానం చేసారు. అందరూ కలిసి పోలీసు
స్టేషనుకు వెళ్ళి దేవతా
విగ్రహం దొంగతనం గురించి ఫిర్యాదు
చేసారు. ఆ ప్రాంతానికి పోలీసు అధికారి అయిన ప్రతాప్ తన విచారణ ప్రారంభించాడు. ఘటనా
స్ధలంలో ఏ ఆధారాలు లేవు. దొంగ ఎవరో తెలియడం లేదు.కానీ చోరీ జరిగిన రోజు రాత్రి గుడి ఎదురుగా ఉన్న ఇంట్లో రాత్రంతా లైటు వెలిగినట్టు రాత్రి అటుగా వెళ్ళిన కొందరు చెప్పారు. అదీ కాకుండా రాత్రి సమయంలో ఆ ఇంటి యజమాని రాజు అక్కడే తచ్చాడినాడని కొందరు చెప్పారు.వెంటనే ప్రతాప్ ఆ దిశగా దర్యాప్తు చెయ్యటం మొదలు పెట్టాడు. అతని దర్యాప్తులో ఆ ఇల్లు తన మిత్రుడైన రాజుది అనే విషయం బయటపడింది. ప్రతాప్ కు ఆశ్చర్యం వేసింది. తన మిత్రుడైన రాజుకి ఆ గుడి విగ్రహం దొంగతనంలో పాత్ర ఉంటుందని అతను ఏమాత్రం ఊహించలేదు. అయినా తన కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి తన మితృడైన రాజుని ప్రశ్నించడానికి అతని ఇంటికి వెళ్ళాడు.
ప్రతాప్ తన ఇంటికి రావటం రాజుకి చాలా
ఆశ్చర్యం కలిగించింది. తన మితృనికోసం
కాఫీ పెట్టమని భార్యకు చెప్పాడు. ప్రతాప్
మాత్రం తన మితృడిని ప్రశ్నించేందుకు
సిద్ధపడ్డాడు.
“రాజూ, విగ్రహం చోరీ జరిగిన రోజు నువ్వు ఎక్కడున్నావు?”అని రాజుని ప్రశ్నించాడు
ప్రతాప్. తన మిత్రుడు తనను అనుమానిస్తున్న విషయం రాజుకి అర్ధం అయ్యింది. మితృడే
తనను అనుమానించినందుకు చాలా బాధ
పడ్డాడు. తనకు తెలిసిన విషయం ప్రతాప్ కు చెప్పటం మొదలు పెట్టాడు. " ఆ రోజు రాత్రి నేను గుడి దగ్గర ఉన్నాను. కానీ నేను మాత్రం విగ్రహం దొంగతనంచెయ్యలేదు.”
అన్నాడు రాజు.
"మరి ఆ విషయం అందరికీ ఎందుకు చెప్పలేదు. అప్పుడు ఎందుకు దాచావు?” రాజుని ప్రశ్నించాడు ప్రతాప్.
"ఎందుకంటే, ఆ రాత్రి ఎవరో వ్యక్తి గుడిలోకి చొరబడుతున్నాడు. నేను ఆపడానికి వెళ్లా. కానీ అతడు నన్ను బెదిరించాడు. నన్ను అక్కడ చూసిన వాళ్ళు నన్నే దొంగగా అనుమానించే
అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం ఎవరికీ
చెప్పలేదు " అన్నాడు రాజు.
“ఆ వ్యక్తి ఎవరో తెలుసా?” అని అడిగాడు
ప్రతాప్.రాజు తల ఊపాడు. "తెలుసు ,
గ్రామంలోని సర్పంచ్ గారి నౌకరు. వాడొక పెద్ద రౌడీ. వాడు దొంగతనం చేసినప్పుడు నేను
వాడిని చూసాను. నన్ను చూసిన వాడు గట్టిగా బెదిరించాడు. తాను విగ్రహాన్ని దొంగిలించిన
విషయం ఎవరికైనా చెబితే నా కుటుంబాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు వాడు అని చెప్పాడు రాజు. వాడికి స్థానిక రాజకీయ నాయకుడి అండదండలు ఉన్నాయి అన్నాడు రాజు. వాడంటే
నాకు ఉన్న భయం వల్ల నేను అప్పుడు నిజం
చెప్పలేక పోయాను అన్నాడు రాజు.
అప్పుడు ప్రతాప్ "తప్పు చేసినవాడు ఎంత గొప్పవాడు అయినా వాడిని వదలకూడదు.
నీ సహకారం ఉంటే నేను వాణ్ణి పట్టుకుని
శిక్షిపడేలా చేస్తాను. ఏమంటావు?" అన్నాడు
ప్రతాప్ తన మితృనితో. సరేనన్నాడు రాజు. ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్ పై ఊరి పెద్దల వద్దకు వెళ్ళి విషయం చెప్పారు.వారంతా చాలా ఆశ్చర్యపోయారు. తమ
ఊరి వాడే ఇలా దేవతా విగ్రహం దొంగతనం
చేశాడంటే వారు నమ్మలేక పోయారు.సర్పంచ్ తన నౌకరుని పంచాయతీ వద్దకు తీసుకుని రమ్మని మనుషులను పంపాడు.
వారు వెళ్ళేసరికి ఆ దొంగిలించిన దేవతా
విగ్రహాన్ని తీసుకుని పారిపోయే ప్రయత్నం
చేస్తున్నాడు అతను.
దొంగ దొరికాడు. అతనిపై
కేసు కట్టి మరుసటి
రోజు కోర్టుకు తీసుకుని
వెళ్ళారు పోలీసులు.
దొరికిన దేవతా
విగ్రహాన్ని వైభవంగా
మళ్ళీ గుడిలో
ప్రతిష్టించారు ఊరి
వారంతా.
రాజుపై ఉన్న అనుమానాలు
తొలగిపోయాయి .అతని నిజాయితీ బయటపడింది. ప్రతాప్ రాజుతో “ నువ్వు ధైర్యంగా విషయం చెప్పావు కాబట్టి దొంగను పట్టుకోగలిగాము. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా ఉండు. ఇక నీ వెంట
నేను ఉంటాను.
భయపడకు. నీ పిరికితనం నిన్ను అసమర్ధుణ్ణి చేస్తుంది "
అన్నాడు ప్రతాప్.
రాజు తన మితృని
గట్టిగా ఆలింగనం
చేసుకుని కన్నీరు
పెట్టాడు. తనను
కాపాడిన తన
మితృడికి ప్రేమతో
భోజన ఏర్పాట్లు
చేసాడు. ఇద్దరూ
ఆనందంగా భోజనం
చేసారు. కధ ముగిసింది.
కధ కంచికి, మనం ఇంటికి
వెళ్దాం పదండి.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని