నీ ఆలోచనలే నీ ప్రగతికి మూలం,,,,!!
మిత్రమా నీ ఆలోచనలు కాంతి వేగం కన్నా మిన్న
అనంత దూరంలో ఉన్న నక్షత్రాలు అలా చూసినంతనే అగుపడుతున్నాయి
మనస్సు ఆలోచనల మహాసముద్రం
తీవ్రమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు నీ చుట్టూర వాటి సంకేతాలు ప్రసరిస్తుంటాయి
వేదనాపూరిత ఆలోచనలు అదుపుతప్పిన ఆరని మంటలు
కాలంతో పాటు మనస్సు తనను తాను అదుపుచేసుకునే శక్తి ఉంది
నిన్ను నీవు గెలవాలంటే బిజీగా ఎదో ఒక పనిలో మునిగిపోవాలి
పుస్తక అధ్యయనం ధ్యానం లాంటివి చేస్తే మనస్సు పక్వమై సరియవుతుంది
మన తీవ్రమైన ఆలోచనల తీరును కుక్కలు కొన్ని జంతువులు గ్రహించే స్వభావం ఉంది
ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేనప్పుడు మానసిక వ్యాధులు వస్తాయి
వీటి బారిన పడితే బయటపడటం చాలా కష్టం
అదుపుతప్పిన ఉద్రేకాలను దుఃఖిత ఆలోచనలను మొదట్లోనే త్రుంచి వేయాలి
మనచుట్టూ సమాజం ఉంది మనను గమనించే వాళ్ళు ఉంటారు
మనోవ్యాకులతలు దుఃఖాల తీవ్రతలు గమనించి స్నేహితులు జనంలో కలిసి మాట్లాడుతుంటే మరచిపోయి రకరకాల వ్యాపకాలలో మునిగితేలుతాం
ఆలోచనలే అద్భుత ఆవిష్కరణలకు మూలం
ఒంటరిగా ఉంటే ఆలోచనలు బుసకొట్టి నిన్ను తినేస్తాయి
అందుకే అధ్యయనం ధ్యానం లాంటివి చేస్తూ జనజీవన శ్రవంతిలో కలిసిపోతే మామూలు మనుషులం అవుతాం
ఇంత తింటున్నామంటే శరీర పుష్టికి ,,,,,సక్రమమైన ఆలోచనలు నూతన సృష్టికి మూలం
అపరాజిత్
సూర్యాపేట
