చిత్ర కవిత
అమ్మెా! గన్ గురి పెట్టి కాల్చకు
నేను ఛస్తే నీకెవరు ఉండరు
నీ గురించి నువ్వు తెలుసు కో
నీకన్నీ సేవలు చేసినా గుర్తించ లేవా!
కాల్చి చంపేస్తే నీకు సేవలు చేసే
వారెవరు?
బాబోయ్! చాలా పెద్ద గురి పెట్టావు..
నేను నీ అమ్మ ను రా!
చిన్నప్పటి నుండి పాలు పోసి పెంచాను..
లాల పోసి జోల పాడాను!
మంచి బుద్దులు నేర్పి పెంచాను
ఇలాంటి పనులు చేస్తావా?
అయ్యెా! అయ్యెా! అయ్యయ్యెా!!
హా....అదేంట్రా? అరటి పండా?
కాల్చి చంపవా? తెచ్చి తినిపిస్తావా?
నా బంగారు కొండే! నా ముద్దుల మూటే!
మా నాయనే! నా బుజ్జి తండ్రే!!
ఉమాదేవి ఎర్రం.
ఇది నా స్వీయ రచన.
