వృద్దాప్య జీవితం ఓ కళ,,,,,,!

కలల వాడిన కన్నీటి పూవుల తడిలో
అరవై ఏళ్లు నిండి రిటైర్మెంట్ ఓ వాడియైన బ్లేడు
తమ వయస్సు స్నేహితులు బంధువులు ఆందోళనలు అలజడులు ఆనందాలు అవలోనలు,,,,,,,
కష్టసుఖాల కావాడిమోతల్లో చివరి అంకం వృద్దాప్యం,,,,,
యవ్వనంలో పెళ్ళి తదుపరి పిల్లలు వాళ్ళ చదువులు,,,,,
పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు సాధించిన ఉద్యోగ విజయాలు,,,,,
తమ జీవిత సహచరులతో కాపురాలతో ఊసుల బాసలు ,,,,,,,,
అవి గమణిస్తూ జీవితంలో తాము సాధించలేనివి పిల్లల విజయాలలో గాంచుతూ తృప్తి,,,,,,,
నడివయస్సు దాటిందంటే జీవిత ఆటుపోట్లను చవిచూస్తూ,,,,,,
అనారోగ్యం బాధరాబందీలతో పాటు ఉద్యోగంలో జీవితంలో ఏదో నైరాశ్యం,,,,,,
భార్యాభర్తలిరువరు ఒకరి మనస్సు ఒకరెరిగి మసలుకోవడం,,,,,,,
తమ జీవితంలో పడ్డ శ్రమలు సుడిగుండాలు ఒకరికొకరు గుర్తుచేసుకుంటూ,,,,,,
డబ్బు ఖర్చు ఆదాయం కోసం కఠిన శ్రమలు పడ్డతీరు ఒక్కోసారి నామోషీయై దుఃఖితునివై రోదించిన క్షణాలు,,,,,,,,,
ఇంకా వేధిస్తున్న ఇరువురి అనారోగ్య సమస్యలు పరిష్కరించగాలేని అనారోగ్యం నాది,అంటూ అనుభవిస్తున్న తలవంపుల జీవితం ఇంకా కొనసాగింపా,,,,,,!?
జీవితంలో వేసిన ఒక్కో అడుగు అధోపాతాళానికే అనుకున్న తరుణంలో ,,,,,,,,,,,,,,,,,,,,,,, పిల్లలు చదువుల్లో మేటియై ఉన్నత శిఖరాలు ఇవిగో డాడీ మమ్మీ మీరు అందరికంటే ముందున్న బహుదూరపు బాటసారులు సరేనా,,,,,,,,
ఇదిచాలు జీవితానికి ఓ ఆనందం ఓ తృప్తి ఇక వెళదాం పద పోదాం అంటూ నా శ్రీమతి ఓ బహుమతి ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, మన మనుమలు మనుమరాళ్ళు మరో జీవితం జ్ఞాపకాల కూడలి,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట