నీవు ఈ భూమి పుత్రునివి మరువకు,,, ,,,!!

సుకుమారి చేతివేళ్ళలోని కలం లిఖించే అక్షరాలు గులాబీమొగ్గలు
ఆమె హృదయం మీటిన భావాలు వెన్నెల తరంగాలు
ఆమె అక్షరాలలో స్వరతంత్రులు పలికే జీవన సోయగాలు మకరందాలొలికే పూవులు,,,,,,,
ఆ సుందరీమణి జ్ఞాన తృష్ణ ముక్కంటి మనోఫలకంపై లిఖించుకున్న భవిష్యత్తు దర్శనం రచియించు అవలోకనం,,,,,,,,,
ఆమె రచనలు చైతన్య శ్రవంతులు ఆత్మ అవలోకనలు జీవనవిధానం సూచికలు,,,,,,,,
అక్షర తపస్వినులు ఆమె గీతాలు తేజోవైరాగ్య దీపికలు జ్ఞానోదయాలు,,,,,,,
ఆమె మది మూర్తీభవించిన జీవనసోయగాల వెలికితీయగాలేని బంగారు గని,,,,,,,,
ఆమె కరకంకణాల గలగలలు ధరిత్రికి శుభోదయాల పుష్పాంజలులు వెలుగుల భాస్కరునికి,,,,,,,,
ఆమె జీవితం కన్నీటి ధారల అనుభవాలు ఊహల కందని నక్షత్రాలు పూసిన ఆనంత ఆకాశం,,,,,,,
ఆమె తన జీవితం ఆత్మకథ రచిస్తే అక్షరాలు కన్నీళ్లపర్యంతమై కలం ముందుకు సాగదేమో మరి,,,,,,,
ఆమె ఎవరు? ఎవరు!? ఎవరోకాదు సుమీ నీ సతీమణి మీ అమ్మ మీ చెల్లి అక్క ఓ స్త్రీ మహిళామూర్తి,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

image