నీకు ఆనందో బ్రహ్మ ...!!!
కర్మతో పుట్టిన దేహమిది
దీనికిలేదు భువిపై ఏదీ శాశ్వతం
ఆశలకు అంకితమయ్యావో అంతమే...
కోరికలను కప్పుకొన్నావో సుడిగుండమే
చితికిన మనస్సుతో చీదరింపై గుణాన్ని
కాల్చుకొంటు నీదికానిది లోకానికీయకు
తడిసిన అనుభవాలకు పొదుగువు నీవై
అడుగులేసిన సమయంతో మొలపించుకో
మూయని తలుపులతో మురిపెమైనా
నిన్ను తొలుచుకుపోయేది కాల ప్రవాహమే
కలల ఎత్తులకు ఎగరాలని చిత్తవకు...
జీవితం నిర్ణయమని వేకువై పెరుగుతు...
కలిమిలేములు కష్టసుఖాలు ఆస్వాధింపై
ఆపాత మధురాలను నెమరేసుకొంటు...
గడిపిన ప్రతిరోజు నీకు ఆనందో బ్రహ్మ...
నడుమొంగిన నా చిత్తం వాడిపోయినా
ఒకనాటి బాల్యాన్ని తొడిగినదే...
ఆ చేష్టలతో కోతి కొమ్మచ్చి లాడినదే...
పొడిచే పొద్దులతో వాలిన నీడలుగా
బతుకు నడిచిన నాకు వయస్సుడిగినా
నిత్యంతో పొందేటి ఆనందం సందేశమే...
ఒడిదుడుకులైనా కలగలుపులతో
ఊతకర్ర పొడుపైన దారులు దాటుతు
మజిలీలలో సేదతీరుతునే నేర్చినవెన్నో...
రూపంలేనిది ఆనందమైనా గమనమవుతు
తోడైన చేతిని విడువక అదే నడిపించేదని
వగుడాకులా రాలిపోయినా రాలినచోటే
ప్రకృతి చిగురులతో ఆనందం వసంతమని
మూసిన రెప్పలతో మౌనమై ఒదగిపోవడమే
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396
