నేటి అంశం
చిత్ర కవిత్వం

శీర్షిక
రారా కృష్ణయ్య 🙏

నా శ్వాస నీవేనయ్యా‌.
నీ రక్షణలోనే ఉన్నాము.
భగవద్గీతను చదివాము.
నీ శిక్షణ తీసుకున్నాము.

కర్తవ్యం నెరవేర్చమన్నావు.
ఫలితం ఆశించవద్దన్నావు.
కాపాడుట నీ వంతన్నావు.
మా కన్నీటిని తుడిచేవు.

ధర్మాన్ని బోధించేది నీవే.
భక్తులను రక్షించేది నీవే.
శిష్టులను కాపాడేది నీవే.
దుష్టులను శిక్షించేది నీవే.

కృష్ణలీలలు అద్వితీయం.
నమ్మినవారు బాగుపడ్డారు.
నిన్ను కొలిస్తే వరాలనిచ్చేవు.
భద్రంగా కాపాడేస్తున్నావు.

కృష్ణయ్యా నీకు దండాలు.
ముకుందా నీకు జేజేలు.
గోవిందా అంటే చాలును,
నేనున్నానని వచ్చేవు.
అభయాన్ని ఒసగేవు.
మాలో ధైర్యాన్ని నింపేవు.
పిలిస్తే పలికేటి దైవం నీవే.
నీ దయ ఉంటే చాలును.
లభించేను సౌభాగ్యాలు.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని