రాఖి పౌర్ణమి సందర్భంగా
అంశం *అన్నా చెల్లెలి అనురాగం* పై నా కవిత.

శీర్షిక
ఎక్కడున్నావు చెల్లెలా

తల్లిదండ్రుల ఆశలను
వమ్ముచేసి పోయావు.
అన్న మనసును నువ్వు
ముక్కలుగా చేసావు.
కుటుంబానికి నువ్వు
కన్నీటిని మిగిల్చావు.
నన్ను ఒంటరిని చేసి
ఏడుపుని మిగిల్చావు.
మమల్ని ఎందుకమ్మా
వదిలేసి వెళ్ళిపోయావు.

చిన్నతనంలో నీతోనే
నేను ఆడుకున్నాను.
నీతోనే కీచులాటలు
ఎన్నెన్నో జరిగాయి.
ప్రేమ నిండిన కబుర్లు
మన మధ్య దొర్లాయి.
ఇప్పుడు అవన్నీ నాకు
జ్ఞాపకాలై మిగిలాయి.

చదువులో నాతో పోటీ
పడి గొప్పగా గెలిచావు.
స్వర్గానికి నువ్వే చాలా
ముందుగా చేరావు.
దేవుడు ఎంత దయలేని
వాడో చూడు చెల్లెమ్మా.
నిన్ను నా నుంచి ఇలా
వేరు చేసేసాడు చూడు.

ఇప్పుడిక నాతో ప్రేమ
కబుర్లు చెప్పేది ఎవరు?
నాతో కీచులాటలు ఆడేది ఎవరమ్మా చెల్లి.
నువ్వు కట్టిన రాఖీలు
పదిలంగా దాచాను.
నీ జ్ఞాపకాలను నేను
మదిలోనే దాచాను.
కన్నీటి సంద్రాన్ని నేను
ఈదుతూ ఉన్నాను.
విడిపోయినా కూడా
హృదయంలో ఉన్నావు.
🤝

ఈ రచన నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
వెంకట భాను ప్రసాద్ చలసాని