స్నేహితుల దినోత్సవం సందర్భంగా కవిత
శీర్షిక
స్నేహాన్ని కాపాడుకోవాలి
నేటి సమాజంలో మంచి నేస్తం వెతికినా దొరకడు.
స్వార్ధం తన విశ్వరూపం చూపెడుతోంది ఇప్పుడు.
ఏదైనా ఆశించి చేసేది
నిజమైన స్నేహం కాదు.
ఆ విషయాన్ని మదిలో
పదిలపరచుకో నేస్తమా.
స్నేహం కోసం ప్రాణాలు
ఇవ్వమనరు దోస్తులు.
చిరునవ్వుతో ఎదురొస్తే
లోకాన్నే గెలుస్తారు. కష్టాల్లో తోడుంటే ధైర్యంగా జీవిస్తారు.
నిన్ను నడిపించేది ఆ
ధైర్య వచనాలే నేస్తం.
నిన్ను ప్రోత్సహించేది
ఆ మంచి మాటలే.
ఎంతో గొప్పది
ఆ స్నేహ బంధం.
నీతో మంచిని చేయించే
వారే నిజమైన నేస్తాలు.
వారి మనసు కష్టపెట్టే
ప్రయత్నం చెయ్యవద్దు.
నీ కన్నీటిని తుడిచేవారు
స్నేహితులు అయితే,
ఆ కన్నీరే పెట్టుకుండా
చేసేవారు గొప్ప నేస్తాలు.
*స్నేహితుడు మన నుంచి విడిపోతే అతనే మనకు పెద్ద శతృవు అవుతాడు. మన రహస్యాలు అతనికి
తెలిసి ఉండటమే
దానికి కారణం.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని