ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం.
శీర్షిక
ధైర్యాన్ని వీడవద్దు.
సమస్యలెన్నో చుట్టుముట్టినా, ప్రశాంతతను
మాత్రం కోల్పోవద్దు.
కష్టాలు ఎదురైనా,
ధైర్యాన్ని వీడవద్దు.
ప్రతి సమస్యకూ ఒక
పరిష్కారం ఉంటుంది.
ప్రయత్నించి చూడు,
ఫలితం లభిస్తుంది.
ఒంటరిగా ఉన్నానని
భావించకు నేస్తమా.
నీ వెంటే మేమున్నాం
అని గుర్తించు మిత్రమా.
నీ ఆశయం పెద్దది.
నీ ప్రయత్నం గొప్పది.
కష్టాలని ఓర్చుకోవాలి.
వాటి నుండి నువ్వెన్నో
పాఠాలు నేర్చుకోవాలి.
ఎవరూ తోడులేకున్నా,
ముందడుగు వెయ్యాలి.
నీకు నువ్వే ఒక సైన్యం
అని గ్రహించు మిత్రమా.
సమస్యలెన్నో చుట్టుముట్టినా, ప్రశాంతతను
మాత్రం కోల్పోవద్దు.
కష్టాలు ఎదురైనా,
ధైర్యాన్ని వీడవద్దు.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్.