ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం
శీర్షిక
ప్రకృతిని కాపాడుకుందాం.
అందమైన ప్రకృతిలో
రంగుల పూలున్నాయి.
రంగుల పూల దగ్గర సీతాకోకచిలుకలెన్నో ఎగురుతున్నాయి.
ఆ రమణీయ దృశ్యం
హృదిని రంచిపజేసేను.
ఆ సుందర చిత్రం
మదిని దోచేస్తోంది.
భవిష్యత్తు తరాలకు ఆ సుందర ప్రకృతిని చూసే అదృష్టం లేదేమో.
చెట్లను కొట్టేస్తోంది
ఈ మానవ సమాజం.
మరి చెట్లు లేకపోతే
పువ్వులుండవు కదా.
పువ్వులు లేకపోతే
సీతాకోకచిలుకలు
కూడా ఉండవు కదా.
అవి లేనినాడు మనిషి
మనుగడ సాగించలేడు.
ఆ అందమైన దృశ్యాలు
మాయమయిపోతాయి.
ఆలోచిస్తేనే మనసు
వికలం అయిపోతుంది.
అందుకే మనం చెట్లు నాటుదాం.
అందమైన ప్రకృతిని
కాపాడుకుందాం.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని.