అక్షరలిపి కొరకు
చిత్ర కవిత
రచన - ఉమాదేవి ఎర్రం
శీర్షిక - తొలిప్రేమ
నిన్ను చూడగానే కలిగింది
నాలో తొలి వలపు..
నాలో రగిలింది నీ పై ప్రేమ తలపు
ఆరు నూరైనా నూరు ఆరైనా
కావాలి నీవే నా గుండె తలుపు
ఒక గూటిలో చేరే గువ్వలమై
ఒకరికొకరుగా నిలిచే ప్రేమికులమై
జీవితాంతం కలిసి ఉండే ఆలు మగలమై
అపురూప జంటయై ఆనందాల పంటయై
ఓ డజను పిల్లలకు తల్లి తండ్రులమై
ఆ పార్వతీ పరమేశ్వరుల వలె
వృద్దులమై ఈ నేల పై బ్రతుకు పండిన
అన్యోన్యమైన దంపతులమై వర్థిల్లాలని
నే కోరుకుంటూ నీకు అందిస్తున్న ఈ ప్రేమ
గులాబీ ని స్వీకరించి నా తొలిప్రేమను
అంగీకరించు పేరు తెలియని ప్రియతమా!!
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!
